Anupama Parameswran: తొలి ఎక్స్‌పీరియ‌న్స్ అడిగిన నెటిజ‌న్.. స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన బ‌బ్లీ గార్ల్

Anupama Parameswran: అనుపమ పరమేశ్వరన్… ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అభినయం విషయంలో కూడా నేటి నటీమణుల్లో మేటి. ఇక ఫాలోయింగ్ అంటారా.. నెక్ట్స్ లెవల్. మళయాల ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆపై వరసబెట్టి యంగ్ హీరోస్ పక్కన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

anupama parameswran stunning answer 1
anupama parameswran stunning answer 1

తాజాగా అనుపమ పరమేశ్వరణ్ తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేసింది. ఇందులో అభిమానులు రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడిగేశారు. నీ మాతృభాష ఏంటి? నీకు తెలుగులో మాట్లాడటం ఇష్టమా? లేదంటే మళయాంలో మాట్లాడటం అంటే ఇష్టమా? నీకు ఇష్టమైన పాట ఏంటి? ప్రస్తుతం చేస్తోన్న సినిమాల లిస్ట్ ఏంటి? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు సంధించారు.

వాటన్నంటికి సమాధానం చెప్పేసింది అనుపమా. మళయాలం త‌న మాతృభాష అని, అన్నింటికంటే కళ్లతో మాట్లాడే భాష నాకు చాలా ఇష్టం అది నాకు బాగా తెలుసు అని తెలిపింది. రౌడీ బాయ్స్, కార్తీకేయ 2, 18 పేజీలు, తల్లిపొగతే వంటి సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇంకా కొన్నిసినిమాలున్నాయి.

anupama parameswran stunning answer 2
anupama parameswran stunning answer 2

కానీ ఇప్పుడే వాటి గురించి చెప్పలేను అని ఇలా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని తొలి అనుభవం గురించి అడిగాడు. మొదటిసారిగా ఆడిషన్‌కు వెళ్లిన నాటి అనుభవం గురించి చెప్పమని అన్నాడు. దాని గురించి ఇప్పుడు ఆలోచించినా కూడా ఎంతో నర్వస్‌గా ఉంటుందని అంది.

రామ్ అంటే తన ఫ్రెండ్ అని, పునీత్ రాజ్ కుమార్ వంటి వ్యక్తితో పని చేసే అదృష్టం రావడం ఈ జన్మకు దొరికిన వరమని, ఆయన ఎంతో మంచి వారు అంటూ చెప్పుకొచ్చింది అనుప‌మ‌. ఈ మ‌ధ్య అనుప‌మ కూడా గ్లామ‌ర్ డోస్ పెంచింది. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది.