Anupama Parameswaran : షాకింగ్.. ఎంగేజ్ మెంట్ చేసుకున్న అనుపమ.. ఫొటోలు వైరల్..!
NQ Staff - June 1, 2023 / 09:21 AM IST

Anupama Parameswaran : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. సడెన్ గా పెండ్లి చేసుకుంటున్నారు. కెరీర్ అయిపోయిన తర్వాత కాదు.. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా కుర్రాళ్ల కలల రాకుమారి కూడా పెండ్లికి రెడీ అయిపోయింది.
ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా మన అనుపమనే. మలయాళ కుట్టి తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు చేసింది. ఇందులో ఆమె చేతికి రింగ్ పెట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎంగేజ్ మెంట్ అయిపోయింది అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు తెగ నవ్వేసుకుంటున్నారు.
ఎందుకో తెలుసా.. ఆమె చేతికి పెట్టుకుంది నిజమైన రింగ్ కాదు.. ప్లాస్టిక్ కవర్ ను సరదాగా పెట్టుకుని ఇలా ఆటపట్టించింది. కొందరేమో ఫన్నీగా.. ఆ ప్లాస్టిక్ కవర్ చేతికి పెట్టిన ఘనుడు ఎవరు అంటున్నారు. మరికొందరేమో డబ్బులు లేవని నీ ప్రియుడు ఇలా ప్లాస్టిక్ కవర్ తొడిగాడా అంటూ ఆటపట్టిస్తున్నారు.

Anupama Parameswaran Shared An Interesting Post On Social Media
ఇలాంటి సరదా పోస్టులు పెట్టడం అనుపమకు చాలా కామన్. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో పోస్టులు చేసింది. ఇక రీసెంట్ గానే కార్తికేయ-2 సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. దీని తర్వాత కూడా మరిన్ని సినిమాలు ఆమె నుంచి వస్తాయని అంతా ఆశిస్తున్నారు.