Anupama: చీర‌క‌ట్టులో అనుప‌మ ప‌రువాల విందు.. మంత్ర‌ముగ్ధుల‌వుతున్న‌ఫ్యాన్స్

Anupama: కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి అందం, అభిన‌యం రెండు ఉన్నాయి. అదృష్టం లేక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డికి సరైన ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. వ‌చ్చిన సినిమాలు కూడా పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అనుప‌మ సోష‌ల్ మీడియాని న‌మ్ముకుంది. ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార అనుపమ పరమేశ్వరన్‌.. అనతి కాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తున్న అనుప‌మ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ‘18 పేజీలు’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్‌’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘తల్లిపోగాదే’లో నటిస్తుంది. ఇక, కన్నడ చిత్రపరిశ్రమను మిస్‌ అవుతుంది. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేసేందుకు రెడీ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నఅనుప‌మ ప‌రువాల విందుతో ఫ్యాన్స్‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.తాజాగా చీర‌క‌ట్టులో వ‌య్యారాలు పోతూ క్యూట్ స్మైల్‌తో పాటు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ యువ‌త హృద‌యాలు దోచుకుంటుంది. ప్ర‌స్తుతం అనుప‌మ ఫొటోలు ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఇటీవ‌ల బ్యాక్‌లెస్ ఫొటోలు షేర్ చేయ‌గా, అవి కూడా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.