Anupama Parameshwaran : అందాల అనుపమకి ఏమయ్యింది.? ఇలా తయారయ్యింది.?
NQ Staff - December 8, 2022 / 03:37 PM IST

Anupama Parameshwaran : మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హీరోయిన్గా అనుపమ సుపరిచితురాలు. మంచి నటి. నేచురల్ బ్యూటీ. అయితే, ఈ మధ్య అనుపమ రకరకాలుగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో రకరకాల యాక్టివిటీస్‌తో తెగ హల్ చల్ చేస్తోంది అనుపమ. డాన్సింగ్ వీడియోలూ, గ్లామర్ ఫోటోలతో కుర్రోళ్లకు గ్లామర్ వలలు విసురుతోంది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టా అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ‘ట్రైల్ ఎర్రర్’ అంటూ ఈ పిక్స్‌కి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇంతకీ ఈ పిక్స్ స్పెషాలిటీ ఏంటంట..?
బ్లాక్ కలర్ శారీలో అనుపమ నవ్వులు చిందిస్తూ కనిపించింది. తన నేచురల్ వుంగరాల జుట్టుతో కనువిందు చేస్తోంది. అన్నింటికీ మించి ఇక్కడ అనుపమ ముక్కు పుడక హైలైట్ అవుతోంది.
మెటల్ కాంబినేషన్ ముక్కు పుడకతో అనుపమ సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తోంది. కాగా, గమనించాల్సిన మరో ఎలిమెంట్ కూడా వుందిక్కడ. ఆమె చెస్ట్‌పై ఓ టాటూ కనిపిస్తోంది. బహుశా అనుపమ ఇచ్చిన క్యాప్షన్ ఈ టాటూ కోసమే అయ్యుండొచ్చు.
ఇంతకు ముందెప్పుడూ కనిపించని టాటూ ఈ పిక్స్‌లో కనిపిస్తోంది. ఇదే ఈ పిక్స్ స్పెషాలిటీ. కొత్త టాటూ, కొత్త బ్యూటీనెస్.. అదిరిందమ్మా అనుపమా.!