Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గత రెండేళ్ళుగా టాలీవుడ్ లో కనిపిచడం లేదు. 2019 లో రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అనుపమ పరమేశ్వరన్ కి వరసగా సినిమా అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా అనుపమ కి అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగులో మిగతా హీరోయిన్స్ తాకిడి ఎక్కువవడంతో అనుపమ దాదాపు తెలుగులో కెరీర్ క్లోజ్ అంటూ చెప్పుకున్నారు. ఇక తమిళ, మలయాళ ఇండస్ట్రీలో కూడా అనుపమకి సినిమాలు లేవు.

అయితే ఒక్కసారిగా టాలీవుడ్ లో ఒకే హీరోతో రెండు సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఆ హీరోనే నిఖిల్ సిద్దార్థ్. అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన నిఖిల్ రెండు సినిమాలకి సైన్ చేశాడు. అందులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. సుకుమార్ రైటింగ్స్ .. జీఏ2 బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. 18 పేజెస్ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కుమారి 21ఎఫ్ సినిమాతో దర్శకుడిగా మారిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Anupama parameshwaran : సక్సస్ లు అందుకొని మళ్ళీ హీరోయిన్ గా కంటిన్యూ..?
కాగా ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కబోతుండగా ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతుందని తాజా సమాచారం. చందు మొండేటి ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ కి బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరో సినిమాలలో నటించే అవకాశం దక్కించుకొని ట్రాక్ ఎక్కింది. అలాగే సక్సస్ లు అందుకొని మళ్ళీ హీరోయిన్ గా కంటిన్యూ గా అవకాశాలు దక్కించుకుంటే బావుంటుంది.