Anubhavinchu Raja Review: అనుభవించు రాజా సినిమా రివ్యూ

Anubhavinchu Raja Review: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా అనుభవించు రాజా. శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆధ్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు అందించారు. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో సినిమా రివ్యూ ఎలా ఉందో చూసెద్దాం.

TheNewsQube-
Anubhavinchu Raja Review and Rating
Anubhavinchu Raja Review and Rating

కథ: రాజ్ తరుణ్ కు తన పూర్వీకుల ఆస్తులు ఉన్నా.. ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటారు. పుట్టిన ఊర్లో అంత ఆస్తి పెట్టుకుని, హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఎందుకు పనిచేస్తున్నాడు? సొంత ఊరు నుండి పారిపోవడానికి కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్ : రాజ్ తరుణ్ హీరోగా కామెడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చక్కని నటనతో పాటు హుషారుగా ఉంటారు. కాశీష్ ఖాన్ హీరోయిన్ తన పాత్ర మేరకు చక్కగా నటించింది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇక సినిమాకి కీలక పాత్రలుగా నటించిన అజయ్, సుదర్శన్ లు చక్కటి అభినయాన్ని అందించారు.

Anubhavinchu Raja Review and Rating
Anubhavinchu Raja Review and Rating

టెక్నికల్ టీం ప‌నితీరు : డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి అనుభవించు రాజా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సిట్యూవేషనల్ కామెడీతో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశారు. సినిమాలో డైరెక్టర్ టేకింగ్ బావుంది. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బావుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • నటీనటుల యాక్టింగ్
  • సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • క్లైమాక్స్
  • కామెడీ
Anubhavinchu Raja Review and Rating
Anubhavinchu Raja Review and Rating

విశ్లేషణ : అనుభవించు రాజా అనే సిట్యూవేషనల్ కామెడీతో తెరకెక్కిన కామెడీ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ని అందిస్తూ.. ప్రేక్షకుల్ని నవ్వించారు. క్లైమాక్స్ పాయింట్ ని కాస్త డల్ చేయడంతో సినిమా కంప్లీట్ అనే ఫీలింగ్ మిస్ అవుతుంది. ఇక వీకెండ్ లో అనుభవించు రాజా సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది.

రేటింగ్: 3/5