Anu Emmanuel : అను ఎమ్మాన్యుయేల్ మ‌రీ ఇంత హాటుగానా.. కుర్ర‌కారు ఏమై పోవాలి..!

Anu Emmanuel : ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన‌ ఎన్నారై బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్. తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. పెద్ద హీరోల‌తో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చిన కూడా ఈ అమ్మ‌డు మంచి ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోయింది.

Anu Emmanuel super photo shoot
Anu Emmanuel super photo shoot

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో చేసిన ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి.

Anu Emmanuel super photo shoot
Anu Emmanuel super photo shoot

నాగచైతన్యతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది. దీంతో ఆఫ‌ర్సే లేవు. ప్ర‌స్తుతం శిరీష్ స‌ర‌స‌న ప్రేమ కాదంట అనే చిత్రం చేస్తుంది.చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ చూస్తుంటే మూవీ ఓ రొమాంటిక్ స్టోరీ అని అర్ద‌మ‌వుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో సినిమా తెర‌కెక్కుతుంది.

Anu Emmanuel super photo shoot
Anu Emmanuel super photo shoot

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అను. తాజ‌గా ఈ ముద్దుగు్మ క్రీమ్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు ఫిదా అయిపోతున్నారు.

కొన్ని రోజులుగా ఈ ఎన్నారై బ్యూటీపై పుకార్లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో అను చాలా దూరం వెళ్లిందని, ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో మునిగిపోయాని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడితో ఈ ప్రచారం ఆగలేదు. వీళ్లిద్దరూ పెళ్లి వరకు వెళ్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చూడాలి.