Anu Emmanuel: అనూ ఇమ్మాన్యుయేల్: మతులు పోగొట్టే అందం.! కానీ, ఏం లాభం.?

NQ Staff - June 21, 2022 / 06:18 AM IST

Anu Emmanuel: అనూ ఇమ్మాన్యుయేల్: మతులు పోగొట్టే అందం.! కానీ, ఏం లాభం.?

Anu Emmanuel: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. చూడచక్కని రూపం. పైగా, నటనలోనూ వెరీ గుడ్డు.! దాంతో, అవకాశాలు తేలిగ్గానే వచ్చాయ్. ఫ్లాపులొచ్చినా ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలొచ్చాయ్.

Anu Emmanuel Latest Stunning Photo

Anu Emmanuel Latest Stunning Photo

ఏకంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ రావడమంటే చిన్న విషయమా.? ఎన్ని అవకాశాలొస్తే ఏం లాభం.? చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. దాంతో, ఐరన్ లెగ్.. అనే ముద్ర పడిపోయింది ఈ బ్యూటీ మీద. దానికి తోడు, నిర్మాతలకు అందుబాటులో వుండదన్న బ్యాడ్ ఇమేజ్ ఒకటి అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్‌ని దెబ్బకొట్టింది.

కొన్నాళ్ళు విదేశాలకే పరిమితమైపోయి..

కోవిడ్ సాకు అని కాదుగానీ, అంతకు ముందే అనూ ఇమ్మాన్యుయేల్ అనూహ్యంగా పెద్ద ‘బ్రేక్’ తీసుకుంది. ఎక్కడ తేడా జరుగుతోంది.? అన్న మీమాంసలో పడి, వచ్చిన కొన్ని అవకాశాల్నీ వదిలేసుకుని, ఆత్మవిమర్శ చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఘనంగా ఇచ్చేద్దామనుకుంది, ఇచ్చేసింది కూడా.
ప్చ్.. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. మళ్ళీ ఫ్లాపు, ఇంకో ఫ్లాపు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏం చేస్తోంది.? అంటే, దానికి సరైన సమాధానమే లేదు. కానీ, ఖాళీగా అయితే లేదట. ఏవో కొన్ని సినిమాలు చేతిలో వున్నాయంటోంది. ఇంకోపక్క, సోషల్ మీడియాలో అడపా దడపా ఫొటోలు షేర్ చేస్తూ, అభిమానులతో టచ్‌లో వుంటోంది. అలా వెలుగు చూసిన ఫొటోనే ఇది. చూడ చక్కని రూపం.. అని ఊరకనే అన్లేదు మరి. చీరకట్టులో మతులు పోగొట్ట అందం ఈ బ్యూటీ సొంతం.

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us