Anu Emmanuel: అమేజింగ్ లుక్స్‌లో అను ఇమ్మాన్యుయేల్.. కుర్రకారు మైమరచిపోతున్నారుగా..!
NQ Staff - March 11, 2022 / 10:16 AM IST

Anu Emmanuel: అందం, అభినయం ఉన్నా సరైన ఆఫర్స్ లేక తెగ ఇబ్బందులు పడుతున్న అందాల ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు తన గ్లామర్‌తో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది.. ‘యాక్షన్ హీరో బైజు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులోనాని సరసన మజ్ను అనే చిత్రం చేసింది. అనంతరం చైతూ నటించిన శైలజా రెడ్డి అల్లుడు మూవీలో కథానాయికగా నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్ చిత్రంలోను మెరిసింది.

Anu Emmanuel Latest Beautiful Photos
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో చేసిన ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

Anu Emmanuel Latest Beautiful Photos
తనను జనాలు మరిచిపోకూడదని అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బేబి మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. క్యూట్ బేబి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్… వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. అయితే కోలీవుడ్‌లో అప్పుడప్పుడూ ఛాన్సులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతీ సినిమాలో అందాలను ఎక్కువగా ఆరబోసి అవకాశాలు అందుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన అను ఇమ్మాన్యుయేల్… తమిళంలోనైనా పాగా వేయాలని చూస్తుంది.