Anu Emmanuel అను ఇమాన్యుయేల్ అందం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రతిభ ఏపాటిదైనా కూడా అదృష్టం మాత్రం ఆమె వైపు చూడటం లేదు. ఒకప్పుడు వరుసగా చిత్రాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అను ఇమాన్యుయేల్ ఇప్పుడు మాత్రం బిత్తరచూపులు చూడాల్సి వస్తోంది. సరైన హిట్ లేక అను ఇమాన్యుయేల్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒక్క హిట్ కోసం అను బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా.. అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో అను కెరీర్ డేంజర్ జోన్లో పడింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన అంత త్వరగా చాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే అవకాశం అయితే వచ్చింది కానీ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో అను ఇమాన్యుయేల్ కెరీర్ ప్రమాదంలో పడింది.
మళ్లీ ఆమెకు చిన్న సినిమాలే గత్యంతరమయ్యాయి. కానీ అందులో ఏ ఒక్కటీ కూడా సక్సెస్ కాలేదు. చివరగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో అయిన మరీ దారుణంగా పరువుపోయింది. సోనూ సూద్‌కు జంటగా నటించింది. సెకండ్ హీరోయిన్‌గానూ ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.
హీటెక్కిస్తోన్న అను ఇమాన్యుయేల్: Anu Emmanuel
అయితే ఇప్పుడు మాత్రం అల్లు శిరీష్ హీరోగా రాబోతోన్న చిత్రంలో నటిస్తోంది. అను ఇమాన్యుయేల్ ఈ మధ్య చేస్తోన్న అందాల విందు గురించి అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో మంట పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ హాట్ పిక్‌తో అందరికీ హీటెక్కిపోతోంది.