ఆస్కార్ అవార్డుల వేడుక‌.. నో మ్యాడ్ ల్యాండ్‌కు అవార్డుల పంట‌

సినీ ప‌రిశ్ర‌మలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ ఏడాది క‌రోనా వ‌ల‌న రెండు నెల‌లు వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో జ‌ర‌గాల్సిన ఈ కార్య‌క్ర‌మం ఏప్రిల్‌లో జ‌రుగుతుంది. కోవిడ్ వ‌ల‌న అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ ల‌లో జ‌రుగుతుంది. వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా జ‌రుగుతున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్స‌వంలో నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం ప‌లు అవార్డ్స్ అందుకుంది. 93వ అవార్డ్ వేడుక‌ల‌లో ఉత్తమ న‌టుడు- ఆంథోనీ హాప్కిన్స్, ది ఫాదర్ చిత్రానికి అవార్డ్ అందుకోగా, ఉత్త‌మ న‌టి- ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్, నోమ్యాడ్ ల్యాండ్ మ‌రియు ఉత్త‌మ ద‌ర్శ‌కురాలు- చోలే జావో ( నో మ్యాడ్ ల్యాండ్‌) అవార్డ్ అందుకున్నారు.

ఉత్తమ న‌టుడు- ఆంథోనీ హాప్కిన్స్, ది ఫాదర్

ఉత్తమ నటి..ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్

ఉత్తమ దర్శకురాలు.. చోలే జావో

ఉత్తమ సంగీతం.. సౌండ్ ఆఫ్ మెటల్

ఉత్తమ సహాయ నటుడు.. డానియెల్ కలువోయో’

ఉత్తమ సహాయ నటి.. యున్ యా జంగ్

ఉత్తమ సినిమాటోగ్రఫీ.. ఎరిక్ (మ్యాంక్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే.. ఎమరాల్డ్ ఫె్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే.. క్రిష్టోఫర్ హామ్టన్, ప్లొరియన్ జెల్లర్ ( ది ఫాదర్)

బెస్ట్ ఇంటర్ననేషన్ ఫీచర్ ఫిల్మ్.. అనదర్ రౌండ్ (డెన్మార్క్)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్.. సెర్హియోలోఫెజ్, మియానీల్,జిమికా విల్సన్ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)

బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్.. అన్‌రాత్ ‘ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)

బెస్ట్ లైవ్ యాక్షన్ ఫిల్మ్.. మార్టిన్ డెస్మండ్ రాయ్ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్.. మైకల్ గ్రోవియర్ (ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : పీట్ డాక్టర్, దానా మరీ (సోల్)

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్.. ఆంథోని (కలెక్టివ్)

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్.. పిపా, జేమ్స్ రీడ్, క్రేగ్ ఫాస్టర్ (మై ఆక్టోపస్ టీజర్)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ (టెనెట్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్.. డోనాల్డ్ బర్ట్ (మ్యాంక్)

Advertisement