Bigg boss: బిగ్ బాస్ లీక్.. హౌజ్ చివ‌రి కెప్టెన్ అత‌నేనా?

Bigg Boss: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి సంబంధించి వ‌స్తున్న లీక్స్ అన్నీ ఇన్నీ కావు. కావాలని చేస్తున్నారో , లేదంటే అనుకోకుండా జ‌రుగుతున్నాయో తెలియ‌దు కాని లీకుల మీద లీకులు వ‌చ్చేస్తున్నాయి. తాజాగా కెప్టెన్ విష‌యంకి సంబంధించి లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

another leak from bigg boss
another leak from bigg boss

బిగ్ బాస్ హౌజ్‌లో చివ‌రి రెండు వారాలు కెప్టెన్‌గా ఎవ‌రు ఉండ‌రు కాబ‌ట్టి, బిగ్‌బాస్‌ హౌస్‌లో చివరి కెప్టెన్‌ కోసం పోటీ జరుగుతోంది. ఎలాగైనా ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్‌ కెప్టెన్‌గా నిలిచినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలే నిజమంటూ తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్‌. ఇందులో షణ్ను చేతికి బ్యాండ్‌ ఉండటంతో అతడే కెప్టెన్‌ అయ్యాడని చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి కూడా కెప్టెన్‌ కాలేకపోయానని పింకీ బోరుమని ఏడ్చేయగా ఆమె కోసం సన్నీ, మానస్‌ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు.

another leak from bigg boss1
another leak from bigg boss1

ఇన్నాళ్లు ఫ్రెండ్లీగా ఉన్న స‌న్నీ మాన‌స్ గట్టిగా అరుచుకున్నట్టు ప్రోమోలో చూపించారు. ఏదేమైన ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆస‌క్తికరంగా సాగనుంద‌ని తెలుస్తుంది. ఇక ఈ వారం మాన‌స్ త‌ప్ప మిగ‌తా వారంతా నామినేష‌న్‌లో ఉండ‌గా, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది ఆస‌క్తికరంగా మారింది.

ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఫుల్ ఫన్ మోడ్‌లో ఉంది. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో ఇంటి సభ్యులంతా బీబీ ఎక్స్ ప్రెస్‌ని డ్రైవ్ చేస్తూ ఫుల్ హంగామా చేస్తున్నారు. పాపం షన్నూకి సుస్సు అర్జెంట్ వాష్ రూంకి పోనీయకుండా ఆపేస్తుంది సిరి. ఆ తరువాత కూడా ఫన్ మామూలుగా లేదు..