Varalakshmi : వరలక్ష్మీ కి టాలీవుడ్‌లో మరో గొప్ప అవకాశం..?

Varalakshmi : వరలక్ష్మీ కి టాలీవుడ్‌లో మరో సినిమా అవకాశం వచ్చిందా.. అవుననే మాట వినిపిస్తోంది. తమిళ సినిమాలలో నటించి అక్కడ బాగా పాపులారిటీ తెచ్చుకున్న వరలక్ష్మీ ఇటీవల టాలీవుడ్‌లో కూడా బాగా పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించిన వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకి బాగా ఆదరణ లభించింది.

another great chance for varalakshmi-‌in tollywood
another great chance for varalakshmi-‌in tollywood

ఇక అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో లాయర్‌గాను వరలక్ష్మీకి చాలా మంచి పేరు వచ్చింది. ఈ రెండు సినిమాలతో వరలక్ష్మీకి వచ్చిన క్రేజ్ దృష్ఠిలో పెట్టుకొని పలువురు దర్శక, నిర్మాతలు వరలక్ష్మీకి తమ సినిమాలలో అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమాలో వరలక్ష్మీకి అవకాశం ఇవ్వబోతున్నారట. క్రాక్ తర్వాత నెక్స్ట్ సినిమాని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడు గోపీచంద్ మలినేని.

Varalakshmi : నెగెటివ్ షేడ్స్ తో వరలక్ష్మీ… గోపీచంద్ వెరైటీగా డిజైన్ చేశాడని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని ప్రస్తుతం స్క్రిప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉండగా.. నెగెటివ్ షేడ్స్ తో ఉన్న ఆ పాత్రను గోపీచంద్ వెరైటీగా డిజైన్ చేశాడని తెలుస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్రను డిజైన్ చేశాడట గోపీచంద్ మలినేని. సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి సినిమా ‘అఖండ’ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన వైవిధ్య భరీతమైన రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి రైతు పాత్ర అయితే మరొకటి అఘోర పాత్ర. ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా మొదలవనుంది.

Advertisement