Rashmika Mandanna: రష్మిక మందన్నకి ‘బంగారం’ లాంటి ఛాన్స్. సినిమా అవకాశం కాదు..

Rashmika Mandanna తన చిలిపి నవ్వులతో, కొంటె చూపులతో, రొమాంటిక్ కట్టూబొట్టుతో కుర్రకారును కట్టిపడేస్తున్న నవ, యువతరం నటి రష్మిక మందన్నకి ‘బంగారం’ లాంటి అవకాశం వచ్చింది. బంగారాన్ని ఒంటి నిండా వేసుకొని ఫొటోలకు పోజులిచ్చే ఛాన్స్ దక్కింది. అది కూడా రీల్ లైఫ్ లోనే కానీ సినిమాల్లో మాత్రం కాదు. వాణిజ్య ప్రకటనల్లో. అంటే ఈ అమ్మడు త్వరలో సరికొత్త అవతారం ఎత్తబోతోంది అన్నమాట. ఖజానా జ్యూలరీ కంపెనీ రష్మిక మందన్నను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. దీంతో ఈ హీరోయిన్ ఇక పై తన అందచందాలను పసిడి ఆభరణాల ప్రమోషన్ కోసం, ప్రచారం కోసం ప్రదర్శించనుంది. వచ్చే(మే) నెల 14వ తేదీన అక్షయ తృతీయ నాటి నుంచి.. రానున్న కొన్ని నెలల్లో ఈ ప్రముఖ సంస్థ రూపొందించే యాడ్స్ లో ఈ చలాకీ కథానాయిక కెవ్వుకేక పెట్టించనుంది.

దేశవ్యాప్తంగా.. దుమ్మురేపనుంది..

సౌత్ ఇండియాలోని ఐదు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ) రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ గల సినీ తారల్లో రష్మిక కూడా ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈమె ఇప్పుడు హిందీ చిత్రసీమలోకి సైతం అడుగుపెట్టంది. దీంతో దేశం మొత్తం పబ్లిక్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ ద్వారా ఖజానా జ్యూలరీ సంస్థవారి భిన్నమైన, అందమైన బంగారు ఆభరణాల లేటెస్ట్, అప్డేటెడ్ డిజైన్లను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

ఆనందంగా.. గర్వంగా..

తమ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన్నను సెలెక్ట్ చేసుకోవటం పట్ల ఖజానా జ్యూలరీ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈమె ద్వారా మా బ్రాండ్, మా కస్టమర్ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రష్మిక మందన్న మాట్లాడుతూ గోల్డ్ కస్టమర్లందరికీ బాగా తెలిసిన కంపెనీ ఖజానా జ్యూలర్స్ అని అన్నారు. వినియోగదారుల్లో ఇంత మంచి పేరున్న సంస్థతో కలిసి పనిచేయటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ డిజైన్లకు, క్వాలిటీకి ఈ కంపెనీ పెట్టింది పేరని పేర్కొన్నారు. ఖజానా చరిత్ర గురించి, దాని బ్రాండ్ వ్యాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఈ సంస్థ స్టోర్లలోని కొత్త కొత్త కలెక్షన్స్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తితో ఉన్నట్లు రష్మిక మందన్న సంతోషంగా చెప్పారు.

Advertisement