Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో పీరియాడికల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విరూపాక్ష అంటూ మొదలై గజదొంగ, బందిపోటు, హరి హర వీరమల్లు అంటూ ప్రచారం జరుగుతున్నాయి. ఫైనల్ గా చిత్ర యూనిట్ వీరమల్లు అన్న టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా తయారవుతోంది. కాగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడికల్ సినిమాలో నటిస్తుండటం విశేషం.

another-bollywood-star-in-pawan-kalyan-krish-movie
another-bollywood-star-in-pawan-kalyan-krish-movie

ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండస్ కూడా పవన్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. జాక్విలిన్ ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహో సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని క్రిష్ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అర్జున్ రాంపాల్ కి మంచి పేరుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ టైం టాలీవుడ్ కి రాబోతున్నట్టు సమాచారం.

అయితే ఇంకా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడించలేదు. చుడాలి మరి అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రకి క్రిష్ ఎంపిక చేశాడో. అధికారకంగా ఎప్పుడు ప్రకటించనున్నారో. ఇక ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవల్ లో రిలీజ్ చేసేందుకే సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక క్రిష్ సినిమాతో పాటు మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement