Koratala siva : కొరటాల శివ – యంగ్ టైగర్ సినిమా అనౌన్స్‌మెంట్‌కి డేట్ ఫిక్స్..?

Koratala siva : కొరటాల శివ దర్శకుడంటే సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రతీ ఒక్కరు బ్లైండ్‌గా ఫిక్సవుతారు. అందుకు కారణం ఆయన సక్సస్ ట్రాకే. స్టార్ రైటర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న కొరటాల శివ దర్శకుడిగా మారుతూ డార్లింగ్ ప్రభాస్ తో మిర్చి సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ మొత్తం కొరటాల శివ పేరు మార్మోగిపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబుకి భారీ హిట్ ఇచ్చాడు కొరటాల.

announcement-date-fixed-for-koratala-siva-young-tiger-movie
announcement-date-fixed-for-koratala-siva-young-tiger-movie

ఈ సినిమాతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం విశేషం. ఆ తర్వాత జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు తీసి వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకొని పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఈ సక్సస్ ట్రాక్ చూసిన మెగాస్టార్ ఆచార్య సినిమాకి అవకాశం ఇచ్చాడు. దాదాపు మూడేళ్ళ నుంచి ఆచార్య సినిమా మీదే ఉన్న కొరటాల శివ నెక్స్ట్ సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించాడు. ఆచార్య తర్వాత మొదలవ్వాలిన ప్రాజెక్ట్ ఇదే.

Koratala siva : ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటన..?

అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ కాకుండా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అని సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయట. పుష్ప సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలున్న కారణంగా ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ కొరటాల కాంబోలో చేయనున్నాడట. వాస్తవంగా ఎన్.టి.ఆర్  ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయాల్సింది మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో. అయితే త్రివిక్రం నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Advertisement