చలాకీ మాటలతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించే యాంకర్స్ ఉన్నారు. కొందరు మాటలతో పాటు అందచందాలతోను బుట్టలో పడేసుకుంటే, మేల్ యాంకర్స్ పంచ్‌లతో పడేస్తున్నారు. ఇందులో యాంకర్ రవి ఒకరు. రవి యాంకరింగ్ అంటే ఆ షోకి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. పటాస్ షో అంత ఫేమ్ కావడానికి కారణం రవి అనే చెప్పవచ్చు. ప్రస్తుతం నువ్వు రెఢీ నేను రెఢీ అనే షోతో పాటు పలు షోస్ తో బిజీగా ఉన్న యాంకర్ రవి ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ కోసం కాస్త స్పేస్ తీసుకున్నాడు.
నవంబర్ 27న యాంకర్ రవి పెళ్ళి రోజు. ఈ సందర్భంగా తన భార్య నిత్య సక్సేనాకు మంచి గిఫ్ట్ ప్లాన్ చేయాలని ఆలోచించాడు. 8 ఏళ్ళ తమ వైవాహిక జీవితానికి గుర్తుగా ఇచ్చిన ఆ గిఫ్ట్ ఎప్పటికి గుర్తుండిపోవాలని భావించి ఓ అందమైన పాటతో సర్ప్రైజ్ చేశాడు. రాహు సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏమో ఏమో కవర్ సాంగ్ చేసారు రవి జోడీ. స్క్రీన్ పై తన రియల్ లైఫ్ వైఫ్ తో కలిసి అదిరిపోయే రొమాన్స్ చేసాడు. జిగేల్ మనే లొకేషన్స్‌లో ఈ పాట షూట్ చేయగా, సినిమా పాటను గుర్తు తెచ్చేలా దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
యాంకర్ రవికి పెళ్లైందనే విషయం ఇప్పటికీ కొంత మందికి తెలియక పోవచ్చు. చాలా రోజుల పాటు ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన రవి కొద్ది నెలల క్రితం తన భార్య నిత్య సక్సేనాతో పాటు కూతురిని తన సోషల్ మీడియా ద్వారా అందరికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఓ షోలో తన కూతురితో కలిసి అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు.రవి పర్ఫార్మెన్స్పై ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే శ్రీముఖితో చెడిన తర్వాత నుండే రవి ఇలా తన ఫ్యామిలీ ఫొటోలను బయటక పెడుతున్నాడంటూ ఓ వర్గం కామెంట్స్ చేస్తుంది. ఏదేమైన తమ 8వ వెడ్డింగ్ డే మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుకోవడంతో పాటు తన భార్యకు గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చాడు.