Anni Manchi Sakunamule : పోటీ లేకున్నా శకునం కలిసి రాలేదు..
NQ Staff - May 19, 2023 / 09:42 AM IST

Anni Manchi Sakunamule : సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో అశ్విని దత్ కుమార్తె నిర్మించిన అన్ని మంచి శకునములే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు వరకు క్రేజీ మూవీ అంటూ టాక్ ను సొంతం చేసుకుంది.
శుక్రవారంకి ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెన్ గ్రౌండ్ లభించింది, పోటీ లేకపోవడంతో కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ను ఈ సినిమా దక్కించుకుంటుందని అంతా భావించారు. కాస్త సక్సెస్ స్టాక్ దక్కించుకుంటే ఈజీగా పాతిక కోట్ల కలెక్షన్స్ నమోదయి ఉండేవి.
కానీ సినిమాకు నిరాశే ఎదురయింది. స్లో కథనం అంటూ రివ్యూలు వచ్చాయి. దర్శకురాలు నందిని రెడ్డి కమర్షియల్ సినిమాగా దీనిని రూపొందించడంలో విఫలం అయ్యారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచి సమయంలో వచ్చిన ఈ సినిమాకు కాలం కలిసి రాలేదు.
అన్నీ మంచి శకునములే అంటూ టైటిల్ లో ఉంది కానీ ఆ శకునం అనేది సినిమాకు కలిసి రాలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరో సంతోష్ శోభన్ మరియు దర్శకురాలు నందిని రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చురుకుగా పాల్గొన్నారు. కానీ అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది.