Annathe : అన్నాతే అంతే స్పెషల్..!

Annathe : అన్నాతే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదే మొదలై కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా రజనీకాంత్‌కి ఆరోగ్య పరమైన సమస్య రావడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక ఆయన ఆరోగ్యం కుదుటపడి షూటింగ్‌కి రెడీ కావడంతో అన్నాతే షూటింగ్ తిరిగి ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు. శరవేగంగా షూటింగ్ సాగుతుండగా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆపాల్సి వచ్చింది.

annathe-special permission for night shoot
annathe-special permission for night shoot

ఇక ఇటీవలే నైట్ కర్ఫ్యూ కూడా విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 9.00గం నుంచి ఉదయం 5.00వరకు ఈ కర్ఫ్యూ సమయాన్ని నిర్ణయించారు. దాంతో అన్నాతే సినిమా నైట్ షూటి్‌కి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం రజనీ బృందం రిక్వెస్ట్ మేరకు అన్నాతే షూటింగ్ నైట్ జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల షూటింగ్ పూర్తైతే అన్నాతే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట. ఈ బ్యాలెన్స్ షూటింగ్ అయిపొగానే చిత్ర బృందం చెన్నై వెళ్ళిపోతారని సమాచారం. అందుకే తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చినట్టు తెలుస్తోంది.

Annathe : అన్నాతేతో రజనీ బ్లాక్ బస్టర్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు.

ఇక ఈ సినిమాకి మాస్ చిత్రాల దర్శకుడు శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో అజిత్‌కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తుండటంతో రజనీకాంత్ శివకి అవకాశం ఇచ్చాడు. గత కొంత కాలంగా రజనీకాంత్‌కి భారీ హిట్ దక్కడం లేదు. కబాలి నుంచి దర్బార్ వరకు వరసగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రజనీ బ్లాక్ బస్టర్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. కీర్తి సురేష్, నయనతార, ఖుష్భూ, మీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement