RAJINIKANTH: ఆసుప‌త్రిగా మారిన అన్నాత్తె చిత్ర లొకేష‌న్.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు..!

RAJINIKANTH సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు శివ తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అన్నాత్తె.ఇటీవ‌లి కాలంలో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రాలు పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను క‌రోనా నిరాశ‌ప‌రుస్తుంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న చిత్రం ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. దీపావ‌ళికి మూవీని ఎలా అయిన రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న క్ర‌మంలో చిత్ర బృందం షూటింగ్ స్పీడ్ పెంచింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అన్నాత్తె షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. అదే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ హై బీపీ వ‌ల‌న అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో షూటింగ్‌ను కొద్ది కాలం పాటు వాయిదా వేశారు. ప్ర‌స్తుతం కరోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ, ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటూ ర‌జ‌నీకాంత్ అన్నాత్తె షూటింగ్ చేస్తున్నారు. ‘అన్నాత్తే’ లొకేషన్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సెట్‌లో ప్ర‌తి ఒక్క‌రు పీపీఈ సూట్స్‌లోనే ఉంటుండ‌గా, ఆ వాతావ‌ర‌ణాన్ని చూస్తే ఆసుప‌త్రిలో ఉన్నామ‌నే భావ‌న క‌లుగుతుంద‌ట‌. 70 ఏళ్ల వ‌య‌స్సులో అది క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో రిస్క్ చేసి మ‌రీ ర‌జ‌నీకాంత్ షూటింగ్ చేస్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు.

ర‌జ‌నీకాంత్‌తో మాట్లాడాలంటే ఎవ‌రైన స‌రే పది అడుగుల దూరం మెయింటైన్ చేయాల్సిందేన‌ట‌. ర‌జ‌నీకాంత్‌తో న‌టించే వాళ్లు ఆ స‌మ‌యానికి త‌లైవాతో న‌టించి వెంట‌నే వారికి కేటాయించిన గ‌దుల‌కు వెళ్లిపోవాలి. ద‌ర్శ‌కుడు శివ కూడా నాలుగు అడుగుల దూరం ఉండే ర‌జ‌నీకాంత్‌కు సీన్ వివ‌రిస్తూ ఉంటారట‌. ర‌జ‌నీ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు మాత్ర‌మే ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటార‌ని, వారు ర‌జ‌నీ ఆరోగ్య‌ప‌రిస్థితుల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మనిస్తూ ఉంటార‌ని స‌మాచారం. ప్రస్తుతం రజనీకాంత్, నయనతార, మీనా కాంబినేషన్‌లో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ షెడ్యూల్‌ మే 10 వరకు జరుగుతుంది.

Advertisement