VAKEEL SAAB: వకీల్ సాబ్ టీంపై క‌రోనా ప‌డ‌గ‌.. ఇద్ద‌రు భామ‌ల‌కు క‌రోనా పాజిటివ్!

ప్ర‌స్తుతం మ‌న దేశంలో క‌రోనా విస్తృతంగా విజృంభిస్తుంది. లాక్‌డౌన్ అమ‌లు చేయ‌ని ప‌క్షంలో అన్ని స‌క్ర‌మంగా న‌డుస్తున్న కార‌ణంగా క‌రోనా మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్, స్పోర్ట్స్, ప‌బ్స్, మాల్స్ , ర‌వాణా వ్య‌వ‌స్థ వ‌ల‌న క‌రోనా వ్యాప్తి ఎక్కువ అవుతుంది. సినిమా సెల‌బ్రిటీస్ షూటింగ్స్‌లో పాల్గొన‌డం, మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో భాగంగా ప‌లువురితో క‌ల‌వ‌డం వ‌ల‌న క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. ఇప్పటికే పలువురు నటీ నటులు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, నటి ఆలియా భట్, నటుడు మాధవన్ తదితరులు కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ప్రభావం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వ‌కీల్ సాబ్ చిత్రంపై పడింది.

వ‌కీల్ సాబ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన నివేధా థామ‌స్ త‌నకు క‌రోనా సోకిన‌ట్టు నాలుగు రోజులు క్రితం సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ‘‘నాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నేను స్వయంగా ఐసోలేషన్‌లో ఉంటూ.. త్వరగా కోలుకొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించి, క్షేమంగా ఉండాల‌ని త‌న పోస్ట్‌లో పేర్కొంది. అలానే గత కొన్ని రోజులుగా ఆమెని కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల‌ని కోరింది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం క‌రోనా పరీక్ష‌లు చేయించుకోగా, వ‌కీల్ సాబ్‌లో న‌టించిన మ‌రో హీరోయిన్ అంజ‌లికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

అంజ‌లి మాత్రం ఎక్క‌డా ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌లేదు. వ‌కీల్ సాబ్ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో నివేదాతో పాటు అంజ‌లి, ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా పాల్గొన‌డంతో వారిలో భ‌యం మొదలైంది. వ‌కీల్ సాబ్ చిత్రం రేపు భారీ ఎత్తున విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రు భామ‌లు క‌రోనా బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన వ‌కీల్ సాబ్ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా న‌టించింది.

Advertisement