ANIL: క‌రోనా క‌ష్టాలు.. మై విలేజ్ షో ఫేం పెళ్లి కార్డు ఫొటో వైర‌ల్‌

క‌రోనా తెచ్చిన క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక‌ప్పుడు అటు వారిని ఇటు వారిని పిలుచుకొని ఘ‌నంగా పెళ్లిళ్లు చేసుకునే వాళ్లం. కాని ఇప్పుడ‌లా లేదు. ఏదో తూతూమంత్రంగా అన్న‌ట్టు వివాహం జ‌రుపుకుంటున్నారు. పెళ్లి కార్డులో కుటుంబ స‌మేతంగా ర‌మ్మ‌ని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం ఆన్‌లైన్‌లో చూసి దీవించండి అంటున్నారు. క‌రోనా మ‌హిమ వ‌ల‌న ప‌రిస్థితులు ఎంత భిన్నంగా మారాయో వీటిని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. తాజాగా మై విలేజ్ షో ఫేం అనీల్ పెళ్లి వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌గా మారింది.

వెడ్డింగ్ కార్డ్‌లో శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని ఉండాల్సిన చోట శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉంది. ఇక వ‌ధూవ‌రుడి ప‌క్క‌న బ్రాకెట్‌లో కోవిడ్ నెగెటివ్ అని రాసారు. ఇక మీ ఫోన్‌ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్‌ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం అని కూడా ఈ కార్డ్‌లో ఉంది. మే 1న పెళ్లి చేసుకోనున్న మాకు కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపండి’ అంటూ ఫ‌న్నీగా వెడ్డింగ్ కార్డ్ రూపొందించాడు అనీల్. ప్ర‌స్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Advertisement