Anil Ravipudi: ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్‌.. ఎఫ్ 3 ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్

NQ Staff - March 30, 2022 / 03:03 PM IST

Anil Ravipudi: ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్‌.. ఎఫ్ 3 ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్

Anil Ravipudi: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ కొట్టిన విష‌యం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. భారీ చిత్రం మల్టీస్టారర్, పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 2022లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలకు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ తో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సందడి చేస్తోంది.

Anil Ravipudi to Work with Jr NTR for his Upcoming Movie

Anil Ravipudi to Work with Jr NTR for his Upcoming Movie

ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఎన్టీఆర్ కేరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. గతంలో యమదొంగ, సింహాద్రి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. పూరీ దర్శకత్వంలో రెండోసారి నటించిన ‘టెంపర్’ మూవీతో ఎన్టీఆర్ వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. 2015 ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ అయి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టగా రూ.74కు పైగా వసూళ్లు చేసింది.

టెంపర్ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ అనే యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ నటించారు. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమా సూప‌ర్ హిట్. బ్లాక్ బాస్టర్ జోష్ లోనే 2017లో సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తారక్. ఇక మాట‌ల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అరవింద సమేత’ చిత్రంలో నటించారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ కు ముందు వచ్చిన ఎన్టీఆర్ చిత్రం ఇదే. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు మూడేళ్ల పాటు సినిమాకి ప‌ని చేసిన ఎన్టీఆర్ ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ‌తో మూవీ ఓకే చేసిన ఎన్టీఆర్ త్వ‌ర‌లో బుచ్చిబాబుతో పాటు ప‌లువురి డైరెక్ట‌ర్స్‌తో కూడా ప‌ని చేయ‌నున్నాడు.

తాజాగా ఎఫ్ 3 డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడితో కూడా క‌లిసి ప‌ని చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఎఫ్ 3 షూటింగ్ పూర్తి చేసి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుంది . 2023 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.

ఇక దిల్ రాజు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయ‌గా, ఆ మీటింగ్‌లో ఎన్టీఆర్- అనీల్ ప్రాజెక్ట్ చ‌ర్చుకు వ‌చ్చింది. తారక్ కూడా కొంతకాలంగా కామిక్ ఎంటర్‌టైనర్ చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. అందుకే అత‌నితో క‌లిసి ప‌ని చేసేందుకు ఆస‌క్తి చ‌పుతున్న‌ట్టు తెల‌స్తుంది. అనుకున్న ప్రకారం పనులు జరిగితే వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us