Anil ravipudi : అనిల్ రావిపూడి నందమూరి హీరోలతో మల్టీస్టార్..?

Anil ravipudi : అనిల్ రావిపూడి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్ వల్ల ఆయనతో సినిమాలు చేసేందుకు
హీరోలు, నిర్మాతలు రెడీగా ఉంటున్నారు. అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ నుండి గత చిత్రం సరిలేరు నీకెవ్వరూ వరకు అన్నీ మంచి హిట్స్ తన ఖాతాలో
వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ గా సక్సెస్ ఫుల్ సినిమా ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 రూపొందిస్తున్నాడు. కాగా ఈ మధ్యన అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాను
నటసింహం బాలయ్యతో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

anil-ravipudi-multi-starer-with-nandamuri-heroes
anil-ravipudi-multi-starer-with-nandamuri-heroes

 

గత ఏడాది నుంచి ఈ వార్తలు వస్తున్నప్పటికి అధికారక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సొషల్ మీడియాలో
న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని రక రకాల చర్చలు మొదలయ్యాయి. అందుకు కారణం అనిల్ తెరకెక్కించే సినిమాలన్ని కామెడీ
జోనర్ లో వచ్చి హిట్ సాధిస్తున్నాయి. బాలయ్య సినిమాలేమో కమర్షియల్ అండ్ మాస్ జోనర్ లో వస్తున్నాయి. అంతేగాక బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయనను మాస్
సినిమాలలో చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు.

Anil ravipudi : బాలయ్యతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరో..?

ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటితో అఖండ సినిమా చేస్తున్నాడు. బోయపాటి – బాలయ్య కలయికలో అఖండ హ్యాట్రిక్ సినిమా కాగా గ్యారెంటీగా హిట్ అందుకోవడం ఖాయమని అందరూ నమ్మకంగా ఉన్నారు. కాగా అనిల్ బాలయ్యతో తీయాలనుకున్న సినిమాలో ఇద్దరు హీరోలు నటించే అవకాశం ఉందని
ప్రచారమవుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కే కథని అనిల్ రెడీ చేసినట్టు సమాచారం. అంతేకాదు బాలయ్యతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించే
అవకాశాలున్నాయంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి ఇండస్ట్రీ వర్గాలలో అలాగే నందమూరి అభిమానుల్లో మాత్రం ఈ వార్త ఉత్సాహాన్ని
నింపుతోంది. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు రానుందో.

Advertisement