Anil ravipudi: హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడితోను మూవీ ప్లాన్ చేస్తున్న చిరంజీవి

Anil ravipudi: మెగాస్టార్ చిరంజీవిలో స‌త్తా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆరుప‌దుల వ‌య‌స్సులోను వ‌రుస ప్రాజెక్టులు లైన్‌లో పెడుతూ అంద‌రిని ఆశ్చర్యింప‌జేస్తున్నారు. . ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి మళ్లీ 2017లో వచ్చిన ఖైదీ నెంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

TheNewsQube-
anil ravipudi driect chiru
anil ravipudi driect chiru

ఇప్పుడు ఒకేసారి నాలుగైదు క‌థ‌ల్ని ఓకే చెప్పేయ‌డం చిత్ర‌సీమ‌ని షాక్ కి గురి చేస్తోంది. ఆచార్య ఇంకా విడుద‌ల కాకుండానే గాడ్‌ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల్ని ప‌ట్టాలెక్కించాడు చిరు. బాబి సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉంది. మారుతితో చిరు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వెంకీ కుడుముల క‌థ‌కీ.. చిరు ఓకే చెప్పాడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ఇప్పుడు అనిల్ రావిపూడితో కూడా చిరు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖాయ‌మైపోయిన‌ట్టే. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం ఎఫ్ 3తో బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు.. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ త‌ర‌వాత‌… చిరంజీవితో సినిమా చేయ‌డం ఖాయం.

చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుండ‌గా, చిత్రంలో మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్‌ సిద్ధగా కనిపించనున్నారు. సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. దీనిని ‘ధర్మమే సిద్ధ’ అంటూ మెగాస్టార్‌ చిరింజీవి షేర్‌ చేయగా, ‘గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్‌ఫుల్‌ టీజర్‌ రానుంది’. అని రామ్ చరణ్‌ ట్వీటారు.

anil ravipudi driect chiru1
anil ravipudi driect chiru1

ఇక 2022 చివ‌ర్లోనే… అనిల్ రావిపూడి సినిమా మొద‌ల‌వుతుంది. 2022లో ఆచార్య వ‌స్తుంది. భోళా శంక‌ర్‌, గాడ్ ఫాద‌ర్‌లు కూడా 2022లోనే విడుద‌ల అవుతాయి. బాబి, మారుతి సినిమాల‌ను ఒకేసారి మొద‌లెట్ట‌నున్న చిరు ఆ వెంట‌నే… అనిల్ రావిపూడి సినిమా చేయోచ్చు అనే టాక్ న‌డుస్తుంది.