Balakrishna : కోట్లు అయినా పర్వాలేదు.. ఆమెనే కావాలంటున్న బాలయ్య!
NQ Staff - September 20, 2022 / 03:22 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ తో ఇప్పటికే నయనతార హిట్ కాంబినేషన్ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ తో నటించేందుకు కొంత మంది హీరోయిన్స్ ఆసక్తి చూపించడం లేదు. కొంత మంది ఆసక్తిగా ఉన్నా వారికి పెద్దగా గుర్తింపు క్రేజ్ లేదు.
దాంతో స్టార్డం ఉన్న హీరోయిన్స్ ని
మాత్రమే బాలయ్య సినిమాలో నటింపజేయాలని ఉద్దేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి నయన తారను సంప్రదించాడని సమాచారం అందుతోంది. ఆమె దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని దాంతో ఆమెను కాదని మరో హీరోయిన్ తో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

Anil Ravipudi Balakrishna Combination Is Preferring Nayanthara Heroine
కానీ బాలకృష్ణ మాత్రం ఈ కథకు కచ్చితంగా నాయన తార అయితేనే పూర్తి న్యాయం చేస్తుంది.. కనుక ఆమెను రెమ్యూనరేషన్ ఎంతైనా పరవాలేదు కానీ ఎంపిక చేయాలంటూ ఆదేశించాడట.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తన సినిమాలో ఆమె హీరోయిన్ గా కావాలి అంటూ బాలకృష్ణ దర్శకుడికి సూచించాడట.
తన పారితోషికంలో కొంత కోత విధించిన పరవాలేదు అన్నట్లుగా ఆయన దర్శకుడితో మరియు నిర్మాతతో అన్నాడట. తన రెమ్యూనరేషన్ కట్ చేసుకుని మరి నాయనతారకు ఇవ్వమని దర్శకుడు కి బాలయ్య చెప్పాడంటే సినిమాలో ఆమెకి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
బాలయ్య ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.