F3: ఎఫ్ 3 సెట్‌లో అనీల్ రావిపూడి బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిపిన చిత్ర బృందం..!

F3: ఫ్లాప్స్ జోలికి వెళ్ల‌కుండా మంచి విజ‌యాలు సాధించుకుంటూ పోతున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఆతర్వాత వరుసగా వియజయలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఎఫ్ 2 సినిమా ముందు వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్.. ఎఫ్ 2 సినిమాకోసం సీనియర్ హీరో వెంకటేష్ ను డైరెక్ట్ చేశారు.

Image

ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈసినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేశాడు అనిల్. మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేశాడు అనిల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సార్ వెంకటేష్ , వరుణ్ తేజ్ తో కలిసి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు అనిల్.

Image

ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్. నేడు ఈ సూపర్ హిట్ దర్శకుడి పుట్టిన రోజు కావడంతో ఎఫ్ 3 చిత్ర యూనిట్ అనీల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతే కాదు సినిమా తారలు కూడా అనిల్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Image

మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అనిల్ కు విషెస్ తెలిపారు.ఇక ఎఫ్ 3 చిత్ర యూనిట్ అనిల్ కి విషెస్ తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇక కొద్ది సేప‌టి క్రిత్ సెట్‌లో అనీల్ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైర‌ల్‌గా మారాయి

తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం అతనేమిటో చెప్పకనే చెబుతాయి.2019, 2020 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. అందుకే 2022లో ‘ఎఫ్ 3’ మూవీని సంక్రాంతికి విడుదల చేసి ఆ సీజన్ లో హ్యాట్రిక్ సాధించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.

Image