Angelina Jolie: ఒంటిపై తేనేటీగ‌ల‌తో ఫొటో షూట్.. ఇదెక్క‌డి పైత్యం అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

ఈ మ‌ధ్య హీరోయిన్స్‌కు పిచ్చి పీక్‌స్టేజ్‌కు వెళ్లింది. జ‌నాల దృష్టిని ఆక‌ర్షించేందుకు ఫొటో షూట్స్ విష‌యంలో స‌రికొత్త‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజ‌గా ఏంజెలినా జోలి ఫొటో షూట్ కోసం వింత‌గా ప్ర‌వ‌ర్తించింది. ఇది చూసి జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంజెలినా జోలీ ఓవైపు వ్యక్తిగత జీవితంలో రకరకాల వివాదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న జోలీ మరోవైపు ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని మాత్రం అస్సలు విడిచిపెట్టడం లేదు. తాజాగా ఈమె ఫొటో షూట్ కోసం దాదాపు 18 నిమిషాలు తేనెటీగలతో కప్పబడి ఉంది.

ఏంజెలినా ఇలా ఫొటో షూట్ చేయ‌డం వెన‌క ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంద‌ని అంటున్నారు. తేనెటీగ సంరక్షణపై అవగాహన పెంచడానికి హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కు పోజులిచ్చింది. ఫోటోషూట్ కోసం ఏంజెలీనా జోలీ వందలాది తేనెటీగలతో తన ముఖాన్ని శరీరాన్ని కప్పబడి ఉండడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. గాబ్రియేలా హ‌ర్ట్స్ దుస్తులు ఏంజెలినా ధ‌రించ‌గా, ఆమె పై తేనే టీగ‌లు ఉండేందుకు ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. జోలీ మినహా సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణాత్మక సూట్లో ఉండాల్సి వచ్చింది. తేనెటీగలు ప్రశాంతంగా ఉండటానికి పరిసరాలు నిశ్శబ్దంగా చాలా చీకటిగా ఉండాలి.
నేను తేనెటీగలు గుంపుగా ఉండాల్సిన చోట ఆమె శరీరంలోని వివిధ ప్రదేశాలలో ఫేరోమోన్ ను ప్రయోగించాను అని ఫోటోగ్రాఫర్ డాన్ వింటర్స్ వెల్లడించారు.