Anee Master: ప‌ద‌కొండోవారం బ‌య‌ట‌కు వ‌చ్చిన అనీ మాస్ట‌ర్ ఎంత పుచ్చుకుంది..!

Anee Master: ప‌దకొండో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనీ మాస్ట‌ర్ స్టేజ్‌పై తెగ సంద‌డి చేసింది. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదవ వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడవ వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదవ వారంలో విశ్వ, పదవ వారంలో జెస్సీ ఎలిమినేట్ అయ్యారు.బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో మరో లేడీ కంటెస్టెంట్‌ బయటకు వచ్చేసింది.

TheNewsQube-
Anee Master Remuneration in Bigg Boss Telugu5
Anee Master Remuneration in Bigg Boss Telugu5

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో 11వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే హౌస్ లో తొమ్మిది మంది ఉండగా హౌస్ కెప్టెన్ రవి మినహాయించి మిగతా 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ యాంకర్ రవి తప్ప మిగితా వారందరూ నామినేషన్‌లోకి రావడంతో మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, ఆర్జే కాజల్ నామినేషన్‌స్ లో తేలారు.

మొదటి నుంచి కాజల్‌ను శత్రువుగా చూసేవారు అనీ మాస్ట‌ర్ . ఆమె ఏ చిన్న పని చేసినా తప్పు పట్టేవారు. రోజులు గడిచే కొద్దీ ప్రతివారం ఆమెను నామినేట్‌ చేసేవారు. తిరిగి కాజల్‌ నామినేట్‌ చేస్తే మాత్రం ఒప్పుకొనేవారు కాదు. గట్టిగట్టిగా అరిచేసేవారు. ఆ కోపంలో అనీ మాస్టర్‌ చేష్టలకు ఇంటి సభ్యులే కాదు, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేవారు. ముఖాన నీళ్లు కొట్టుకోవడం, వెక్కిరించడం, హేళనగా మాట్లాడుతూ డ్యాన్స్‌ చేసేవారు.

అదేమంటే ‘నేను అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు’ అంటూ తనని తాను సమర్థించుకునేవారు.‘ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌’ విషయంలోనూ కాజల్‌ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఇంటిలో వీరంగం సృష్టించారు. ఈ విషయంలో నాగార్జున సైతం అనీ మాస్టర్‌ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి చురకలు అంటించారు.

Anee Master Remuneration in Bigg Boss Telugu5
Anee Master Remuneration in Bigg Boss Telugu5

అయితే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన యానీ మాస్టర్‌కు ఎంత ముట్టింది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీల పాపులారిటీని బట్టి బిగ్‌బాస్‌ టీమ్‌ ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కో రకంగా రెమ్యునరేషన్‌ ఇస్తుంది. పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న యానీకి షో నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట!

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట! ఈ లెక్కన 11 వారాలకు గానూ ఆమె రూ.30 లక్షల పైచిలుకు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె హౌస్‌లో ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధారంగా ఈ రెమ్యునరేషన్‌ ఇంకా ఎక్కువే ఉండొచ్చని టాక్.