Anchor Ravi : ర‌వి కూతురిపై దారుణంగా కామెంట్స్… స్పందించిన అనీ మాస్ట‌ర్

Anchor Ravi : బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచే యాంక‌ర్ ర‌వి ఈ సారి బిగ్ బాస్ షోలో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ముందు నుంచే యాంకర్‌ రవికి బిగ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ, హౌస్‌లోకి వెళ్లాక..తనదైన ఆటతీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

anee master react on anchor ravi daughter comments
anee master react on anchor ravi daughter comments

ప్రతివారం ఎలిమినేషన్‌లో ఉండడం కూడా రవికి కలిసొచ్చిందనే చెప్పాలి. నామినేషన్‌ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఆయన హౌస్‌లో ఉన్నాడు. అయితే సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, ర‌విని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు.

anee master react on anchor ravi daughter comments
anee master react on anchor ravi daughter comments

రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నాడు కాబట్టి..అతన్ని తిట్టినా, పొగిడినా పర్లేదు.. కానీ అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్‌ చేయడం దారుణమనే చెప్పాలి. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిను ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్‌ స్పిరిట్‌ కాదని, తమకు ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది.

తను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే రవి భార్య నిత్యకు సైతం వేధింపులు తప్పట్లేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది అనీ మాస్ట‌ర్ . ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నవారికి వార్నింగ్‌ ఇస్తూ వీడియోలు పోస్ట్‌ చేసింది.’బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో జరిగే గొడవలను చూస్తున్నా. మీరు మొదటి నుంచి 11 వారాల వరకు చూడటం లేదా? మీరు ఒకరికి ఫాలోవరే కావచ్చు, అభిమానే కావచ్చు.

కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్‌ చేస్తే మాత్రం చులకన చేస్తున్నానని, అగౌరవపరుస్తున్నానంటూ దాన్ని బాగా హైలైట్‌ చేస్తున్నారు. అంటే.. ఒకరిని అమ్మేస్తానంటూ అగౌరవపర్చడం కాదా? అది మీరు లైట్‌ తీసుకున్నప్పుడు నా డ్యాన్స్‌ మాత్రం ఎందుకింత హైలైట్‌ చేస్తున్నారు? మరో ముఖ్య విషయమేంటంటే నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను. ఆమె కూతురు వియూ వీడియోల కింద బ్యాడ్‌ కామెంట్లు పెడుతున్నారంట! ఐదేళ్ల చిన్న పాపండీ.. ఇది కరెక్ట్‌ కాదు. మేమంటే భరిస్తాం, కానీ చిన్నపిల్లల వీడియోల మీద ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అంటూ ఫైర్ అయింది అనీ మాస్ట‌ర్.