Sitara: అనీ మాస్ట‌ర్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసిన సితార‌

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితార సినిమాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చాలా యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే తనలోని మల్టీ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపించిన సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అభిమానులకు తెలిసిందే.

TheNewsQube-
Anee Master Dance With Sitara
Anee Master Dance With Sitara

తాజాగా కొరియోగ్రాఫర్‌, బిగ్‌బాస్‌5 కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులేసింది. డీజే స్నేక్ చార్ట్‌ బస్టర్ ‘టకీ టకీ’అనే పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది.

‘యానీ మ్యామ్‌ స్టెప్పులతో రీచ్‌ అవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా రావాల్సి ఉంది’ అంటూ సితార ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే సితర డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొడుతుందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టర్‌ 11వ వారం హౌస్‌ నుంచి బయటకి వచ్చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ లో ఇన్ని రోజులు ఉన్నందుకు యాని మాస్టర్ కి బాగానే లాభం చేకూరిందని సమాచారం.ఒక పక్క స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ, మరో పక్క షోస్ లో హడావిడి చేస్తూ బుల్లి తెరపై అలరిస్తున్న యాని మాస్టర్ కి బిగ్ బాస్ షో నిర్వాహకులు బాగానే రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.

యానీకి ఒక్క వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికం ఇచ్చారంట. ఈ లెక్కన 11 వారాలకు గానూ ఆమెకు దాదాపు 25 లక్షల వరకు అందిందని సమాచారం. హౌస్ లో చేరి వచ్చిన డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కోవాలి అని యాని మాస్టర్ కల. మరి ఇప్పుడు సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటుందేమో చూడాలి.