Andharu Bagundali Andhulo Nenundali Movie Review : అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూ..

NQ Staff - October 28, 2022 / 11:16 AM IST

Andharu Bagundali Andhulo Nenundali Movie Review  : అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూ..

Andharu Bagundali Andhulo Nenundali Movie Review  : ప్రముఖ నటుడు అలీ మలయాళంలో హిట్ అయిన వికృతి అనే సినిమాను తెలుగులో ”అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” అనే టైటిల్ తో నిర్మించారు.. తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించగా అలీ హీరోగా, మౌర్యాని హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా డైరెక్ట్ గా ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యింది.. మరి ఈ సినిమా రివ్యూ చూద్దాం..

కథ..

శ్రీనివాసరావు (నరేష్), సునీత (పవిత్ర లోకేష్) ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. వయసు మీద పడేకొద్దీ ఇద్దరు ఎంతో ప్రేమగా ఉంటుంటారు.. కొడుకు, కూతురు తో ఎంతో సంతోషంగా ఉండే వీరి ఫ్యామిలీ మహమ్మద్ సమీర్ ( అలీ) తీసిన ఒక ఫోటో కారణంగా ఎలా అస్తవ్యస్థంగా మారాయి ? అలీకి ఉన్న సెల్ఫీల పిచ్చితో ఇతడు పెద్ద సమస్యలో ఎలా ఇరుక్కున్నాడు? హీరోయిన్ తో ఎలా ప్రేమలో పడ్డాడు? చివరికి ఏం జరిగింది.. అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

విశ్లేషణ..

సినిమా లోని సెన్సిటివ్ ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటాయి. మీరు నిజ జీవితంలో ఎదుర్కొన్నట్టు అనిపిస్తుంది. నరేష్, పవిత్ర లోకేష్ బాండింగ్ బాగా ఆకట్టు కుంటుంది.. సినిమా సాగే తీరు అందరిని కట్టిపడేస్తుంది.. సినిమాలో అస్సలు ఫ్లో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా సహజంగా ముందుకు సాగుతుంది.. అలీ పాత్ర బాగానే మెప్పిస్తుంది.. కథను మలుపు తిప్పే పాత్రలో లాస్య నటన బాగుంది.. ఒరిజినల్ మూవీ కంటే కూడా ఇంకా బాగా ఆకట్టుకునే ఎమోషన్స్ బాగా నడిపించాడు డైరెక్టర్..

ప్లస్ పాయింట్స్..

పవిత్ర లోకేష్-నరేష్ మధ్య కెమిస్ట్రీ

అలీ నటన

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్..

సంగీతం

కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్

చివరగా..

ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ కెమిస్ట్రీ పర్వాలేదనిపిస్తుంది..ఇందులోని నటీనటులు నటనా పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఎమోషనల్ ఎలిమెంట్స్ పండించిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి.

పెద్ద స్టార్స్ లేకపోయినా కథ పరంగా సినిమా నెగ్గుకొచ్చింది.కథలో ఇంకాస్త ఎమోషనల్ ఎలిమెంట్స్, కామెడీని యాడ్ చేస్తే సినిమా సూపర్ అనొచ్చు.మొత్తానికి మూవీని ఒకసారి చూడొచ్చు.

 

 

                                                              రేటింగ్ : 2/ 5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us