Vishnu Priya : అతడిని చూస్తే నలిపేయాలి అనిపిస్తుందంటున్న హాట్‌ యాంకర్‌

NQ Staff - November 16, 2022 / 11:39 AM IST

Vishnu Priya : అతడిని చూస్తే నలిపేయాలి అనిపిస్తుందంటున్న హాట్‌ యాంకర్‌

Vishnu Priya : తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా సుపరిచితురాలైన విష్ణు ప్రియ కి అఖిల్ అక్కినేని అంటే ఎంతటి అభిమానమో.. ఇష్టమో అందరికీ తెలిసిందే. గతం లో పలు సందర్భాల్లో తనకు అఖిల్‌ అంటే కేవలం ఇష్టము కాదు అంతకు మించి అన్నట్లు విష్ణు ప్రియ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఒక కార్యక్రమం లో విష్ణు ప్రియ పాల్గొని ఆ సందర్భంగా యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ నీ యొక్క క్రష్ ఎవరు అంటూ ప్రశ్నించగా ఏ మాత్రం తడుముకోకుండా అఖిల్ అక్కినేని అంటే నాకు క్రష్ అంది.

అతడు అంటే పిచ్చి ప్రేమ.. అతడిని చూస్తే నలిపి వేయాలనిపిస్తుంది అంటూ సైగలు చేస్తూ తెగ సిగ్గు పడిపోతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలోనే అఖిల్ అంటే తనకు అమితమైన ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన విష్ణు ప్రియ తాజాగా అతడిని చూస్తే నలిపి వేయాలనిపిస్తుంది అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఒక హీరో అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. కానీ ఈ స్థాయిలో ఒక హీరోని ఇష్టపడడం అరుదుగా చూస్తూ ఉంటాం అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి అతడితో నటించే అవకాశం వస్తే జీవితం ధన్యం అన్నట్లుగా విష్ణు ప్రియ ఎదురు చూస్తుందట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us