Vishnu Priya: గుడ్ న్యూస్ చెబుతాన‌న్న విష్ణు ప్రియ‌.. పెళ్లి వార్తేమో అని అభిమానులు వెయిటింగ్

Vishnu Priya: బుల్లితెర‌పై స‌త్తా చాటే యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఈ అమ్మడు త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. వెండితెర‌పై మెరిసిన విష్ణు ప్రియ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ఈ అమ్మ‌డు నాభి అందాల‌తో ఎక్కువ‌గా అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తూ ఉంటుంది.

Anchor Vishnu Priya About Good News Announcement
Anchor Vishnu Priya About Good News Announcement


విష్ణు ప్రియ ఈటీవీ లో వచ్చే పోవే పోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది, ఆ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో సుధీర్ పైన పంచులు వేస్తూ చాలా తక్కువ కాలంలో ప్రేక్షకులు దగ్గరయ్యింది. దాని కంటే ముందే చాలా షోస్ చేసినా సరే పోవే పోరా షో తో సక్సెస్ అయింది గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ భామ సినిమాల మీద ఇష్టంతో డాన్స్ కూడా నేర్చుకుంది.


తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది విష్ణు ప్రియ‌. మలయాళంలో మయూఖం, తమిళ్ లో శివ పతిగారం,గూలి, తెలుగులో యమదొంగ సినిమాలో కూడా ఆమె నటించింది. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో అలాగే సీరియల్స్ లో కూడా నటించింది, ఇప్పుడు యాంకర్ గా స్థిరపడింది, చిన్నప్పటినుండి భగవద్గీత నేర్చుకున్న ఆమె కాలేజ్ అయ్యాక సాయంత్రాలు చిన్న పిల్లలకి భగవద్గీత నేర్పిస్తూ 3000 వేల దాకా డబ్బు సంపాదించేదట.


సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ నిత్యం నెటిజ‌న్స్‌తో ట‌చ్‌లో ఉంటూ ఉంటుంది. అయితే తాజ‌గా త‌న సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోన్నాను.. అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వెయిట్ చేయండి అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజ‌న్స్ సినిమా ప్ర‌క‌ట‌న చేస్తుందా, లేక పెళ్లికి సంబంధించిన విష‌యం ఏదైన చెబుతుందా అని ఆమె పోస్ట్‌కి రిప్లైలు ఇస్తున్నారు.