Anchor Varshini: ఇప్ప‌టికే త‌గ్గించాను, ఇంకేం త‌గ్గించాలి అంటూ యాంక‌ర్ వ‌ర్షిణి ఫైర్..!

Anchor Varshini: బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లకు ప్లాట్‌ఫాం దొర‌కాలే కాని తెగ రెచ్చిపోతున్నారు. అందాల ఆర‌బోత‌లోను ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా ర‌చ్చ చేస్తున్నారు. తెలుగులో యాంక‌ర్స్ ర‌ష్మీ గౌతమ, వ‌ర్షిణి త‌మ మాట‌ల‌తో పాటు అందాల‌తో ఎంత‌గా అల‌రిస్తున్నారో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కామెడీ స్టార్స్ ప్రోగ్రాంని సింగిల్ హ్యాండ్‌తో వ‌ర్షిణి న‌డిపిస్తుండ‌గా, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోని ర‌ష్మీ హోస్ట్ చేస్తుంది.

Anchor Varshini Mass Dance
Anchor Varshini Mass Dance

ర‌ష్మి, వ‌ర్షిణి ఇద్ద‌రు ఓంకార్ హోస్ట్ చేస్తున్న బుల్లితెర పాపుల‌ర్ షో సిక్త్స్ సెన్స్ సీజన్ 4 లో సందడి చేశారు. ఓంకార్ వీరిద్దరితో మస్త్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ ను ప్లాన్ చేశాడు. వీరిద్దరి కాంబోలో ఈ షో రాబోతున్న నేపథ్యంలో అందరి అంచనాలు భారీగా ఉంటాయి. ఖచ్చితంగా వీరిద్దరు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తారని అంతా ఆశిస్తున్నారు. అంచనాలు తగ్గకుండా షో ఉంటుందని తాజా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.

ఓ ఫ్రేంలో ఓంకార్ .. ర‌ష్మీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమె క‌ళ్ల‌ల్లోకి క‌ళ్లు పెట్టి చూస్తూ నువ్వు నవ్వితే మల్లెపూల సునామి.. చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ అందుకే మీరు అంటే అందరికి ఇష్టం. ఆ మాటలకు సిగ్గు పడుతూ రష్మి ఎక్స్ ప్రెషన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అలానే త‌న డ్యాన్స్‌తోను ఈ అమ్మ‌డు అద‌ర‌గొట్టింది. మాస్ మ‌సాలా డ్యాన్స్ వేస్తూ యూత్‌ని ఆక‌ట్టుకుంది.

ఇక ఈ షోలో వ‌ర్షిణి హంగామానే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు ప్రోమోని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ఓ సంద‌ర్భంలో ర‌ష్మీతో ఎగ్ కొట్టేస్తావా అని వ‌ర్షిణి అని అడ‌గ‌గా, దానికి బ్యాక్ గ్రౌండ్‌లోఇవే త‌గ్గించుకుంటే మంచిది అనే వాయిస్ వ‌చ్చింది. వెంట‌నే స్పందించిన వ‌ర్షిణి ఇంకేం త‌గ్గించుకోవాలి, ఇప్ప‌టికే త‌గ్గించుకొని వ‌చ్చాను అంటూ మినీ స్కట్ లో దాగిన ఉన్న‌ థైస్ ను చూపించింది. అనంత‌రం పూన‌కం వ‌చ్చినట్టు డ్యాన్స్ చేసింది. వీరి రచ్చ‌కు ఈ షో రేటింగ్ భారీగా పెరుగుతుందేమో చూడాలి.Anchoe