Anchor Suma Kanakala : యాంకర్ సుమకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక..!
NQ Staff - June 9, 2023 / 10:54 AM IST

Anchor Suma Kanakala : ఈ నడుమ యాంకర్ సుమ పెద్దగా కనిపించట్లేదు. వాస్తవంగా టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద సినిమా ఈవెంట్ అయినా, లేదంటే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు అయినా సరే కచ్చితంగా సుమకు మాత్రమే ఇస్తారు. సుమకు డేట్లు కుదరకపోతే వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఈవెంట్లను సుమ హ్యాండిల్ చేసినట్టుగా ఇంకెవరూ హ్యాండిల్ చేయలేరు.
అది అందరికీ తెలుసు. అలాంటిది ఇండియాలోనే అతిపెద్ద సినిమాగా వస్తున్న ఆదిపురుష్ మూవీ ఈవెంట్ లో సుమ కనిపించలేదు. అంత పెద్ద ఈవెంట్ లో సుమ కనిపించకపోయేసరికి ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేంటి సుమ ఎందుకు చేయలేదు అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సుమ స్పందించింది. ముందుగా ప్రభాస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. వాస్తవంగా ఆదిపురుష్ ఈవెంట్ ముందుగా నాకే వచ్చింది. కానీ ఆ సమయానికి నేను ఇండియాలో లేను. పారిస్ మరియు స్విట్జర్ లాండ్ టూర్ లో ఉన్నాను. పైగా టూర్ లో బాగా తిరిగేయడం వల్ల నా కాళ్లకు గాయాలు అయ్యాయి.

Anchor Suma Kanakala Was Seriously Injured
షూలు కొరికేయడంతో వేళ్లు నడవడానికి ఇబ్బందిగా ఉన్నాయి. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఫొటోలను షేర్ చేసింది యాంకర్ సుమ. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సుమ ఫ్యామిలీ మొత్తం టూర్ లోనే ఉంది.