Anchor Suma : ఎప్పుడూ చలాకీగా కనిపించే సుమ మనసులో తీరని ఆ బాధ ఏంటో తెలుసా.?

NQ Staff - September 3, 2022 / 06:15 PM IST

156504Anchor Suma : ఎప్పుడూ చలాకీగా కనిపించే సుమ మనసులో తీరని ఆ బాధ ఏంటో తెలుసా.?

Anchor Suma : బుల్లితెరపై యాంకర్‌గా నెంబర్ వన్ ఛైర్ సుమ సొంతం. గత రెండు దశాబ్ధాలుగా ఆ ఛైర్ కేవలం సుమకే పరిమితమైపోయింది. బుల్లితెరపై జరిగే రియాల్టీ షోలే కాదు, పెద్ద తెరకు సంబంధించిన ఫంక్షన్లూ, ఈవెంట్లతోనూ సుమ ఎప్పుడూ బిజీగా గడుపుతుంటుంది.

Anchor Suma deep Pain in heart

Anchor Suma deep Pain in heart

సోషల్ మీడియాలోనూ సుమ కనకాల ఓ సెన్సేషన్. ఈ మధ్య యాంకర్ సుమ సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ విషయాలను ఈ ఛానెల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మరింత దగ్గరగా మసలుతుంటుంది యాంకర్ సుమ. సుమ నోటి వెంట ఏ మాట వచ్చినా క్షణాల్లో అది వైరల్ అయిపోతుంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా తన మనసులోని బాధను పంచుకుంది యాంకర్ సుమ. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సుమ కనకాలకు తీరని ఆ బాధేంటనుకుంటున్నారా.?

అత్తగారిపై యాంకర్ సుమకు ఎంత ప్రేమో.!

ఇటీవలే సుమ కనకాల తన అత్త మామల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. సుమకు ఆమె అత్తగారంటే చాలా ఇష్టమట. సినిమా ఈవెంట్లూ, టీవీ షోలు.. ఇలా ఎప్పుడూ బిజీగా బయటే గడుపుతూ వుండే సుమకు ఇంట్లో తన అత్తగారు చాలా సపోర్టింగ్‌గా వుండేవారట. పిల్లలను దగ్గరుంచి ప్రేమగా చూసుకునేవారట.

తల్లి అవసరం లేకుండా అన్నీ తానేయై పిల్లలను పెంచిన అత్తగారు తనకు తల్లితో సమానమనీ, ఆమె లేని లోటు తనకు ఎవ్వరూ తీర్చలేనిదనీ సుమ బాధపడింది. ప్రతీరోజూ అత్తగారి ఫోటో చూసి కన్నీరు పెట్టుకోని రోజు లేదని సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.