Sreemukhi: శ్రీముఖికి పెళ్లి సంబంధం తెచ్చిన అభిమాని.. వరుడు ఎవ‌రంటే..!

Sreemukhi: బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒకరు. త‌న అందంతో పాటు మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ ఈ మ‌ధ్య కాలంలో తెగ ట్రెండ్ అవుతుంది. ప‌టాస్ షోతో పాపులారిటీ ద‌క్కించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ఇటు బుల్లితెర అటు వెండితెర‌పై తెగ ర‌చ్చ చేస్తుంది. అయితే లాక్‌డౌన్ స‌మ‌యం నుండి శ్రీముఖి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అల‌రిస్తుంది.

రీసెంట్‌గా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్’ ప్రోగ్రాంలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ముసుగుతో వచ్చిన ఆమె.. ఏకంగా యాంక‌ర్ ప్ర‌దీప్‌కు ఐ లవ్ యూ చెప్పేసింది. దీంతో ప్రదీప్ తెగ సిగ్గు పడిపోయాడు. ఈ సీన్ చూసి సింగర్ సునీత, ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి ఆశ్చర్య పోయారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

ఇక తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ అభిమాని పెళ్లి సంబంధం తెచ్చానంటూ శ్రీముఖికి మెసేజ్ పెట్టాడు.అది చూసి శ్రీముఖి షాకైంది. అక్క ఒక మంచి మ్యాచింగ్ ఉంది మాట్లాడుదామా.. నీకు పర్ఫెక్ట్ జోడి అంటూ నెటిజ‌న్‌ తెలుపగా వెంటనే శ్రీముఖి నవ్వుతూ ఎవరది అంటూ స్పందించింది. శ్రీముఖి ప్ర‌శ్న‌కు స‌ద‌రు నెటిజ‌న్ బ‌దులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ వ్య‌క్తి ఎవ‌రు అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది.

అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో శ్రీముఖి నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో ఆకట్టుకోవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గానూ చేసింది.

బుల్లితెర‌పై శ్రీముఖి ‘అదుర్స్’ అనే షోతో యాంకర్‌గా అడుగెట్టింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వరుసగా షోలు చేస్తూ సత్తా చాటింది. తన కెరీర్‌లో ఆమె ‘అదుర్స్ 2′, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసి స్టార్‌డమ్‌ను అందుకుంది.

ప్ర‌స్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తోన్న ‘క్రేజీ అంకుల్స్’లో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. శ్రీముఖి. అలాగే, నితిన్ నటిస్తోన్న ‘మాస్ట్రోలో న‌టిస్తుంది. మంచి ఛాన్స్ కోసం శ్రీముఖి క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాతోనే చాలా హైలైట్ అవుతుంది.