Shyamala: చీర‌క‌ట్టులో వ‌య్యారాలు పోయిన యాంక‌ర్ శ్యామ‌ల‌

Shyamala: హీరోయిన్‌కి తీసిపోని అందం యాంక‌ర్ శ్యామ‌ల‌ది. యాంక‌రింగ్‌తోనే కాకుండా అప్పుడ‌ప్పుడు న‌టిగాను అద‌ర‌గొడుతుంది. ముఖ్యంగా టీవీ ఇంట‌ర్వ్యూస్‌, ఆడియో వేడుక‌ల‌తో తెగ సంద‌డి చేస్తుంటుంది. మొదట్లో టీవీల్లో వంటల ప్రోగ్రామ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. అయితే వంటల కార్యక్రమాలు చేసే సమయంలో ఆమెకు ప‌లు షోస్ వ‌చ్చాయి. పెళ్లైన త‌ర్వాత కూడా శ్యామ‌ల రాణిస్తూనే ఉంది.

Anchor Shyama Beautiful Pics in Saree
Anchor Shyama Beautiful Pics in Saree

 

పలు టెలివిజన్ కార్యక్రమాల్లో వ్యాఖ్యతగా నిలిచిన శ్యామల, బిగ్ బాస్ సీజన్ 2లో తళుక్కున మెరిసారు. చివరి వరకూ బిగ్ బాస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న శ్యామల ప్రేక్షకులను అభిమానం పొందింది. సీజ‌న్ 2లో ఒక‌సారి ఎలిమినేట్ అయిన శ్యామ‌ల మ‌ళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకుంది.

Anchor Shyama Beautiful Pics in Saree
Anchor Shyama Beautiful Pics in Saree

ఇటీవ‌ల త‌న భ‌ర్త చీటింగ్ కేసులో అరెస్ట్ కాగా, త‌న భ‌ర్త‌కు మ‌ద్ద‌తు ఇచ్చి వార్త‌ల‌లోకి ఎక్కింది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్యామ‌ల ఏ మాత్రం ఎక్స్‌పోజింగ్‌కు పోకుండా ఘాటు అందాల‌తో హీటెక్కిస్తుంటుంది. తాజాగా శారీ లుక్‌లో కేక పెట్టించింది. శ్యామ‌ల‌ని చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు