Anchor Shiva : అఖిల్ బ్యాచ్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన శివ.. ఏడుపొక్కటే తక్కువ
NQ Staff - May 11, 2022 / 08:58 AM IST

Anchor Shiva : బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం అవుతోంది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు.

Anchor Shiva fire on akhil team
అయితే ఈ వారం హౌజ్‌లో ఎనిమిది మందిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు బిగ్ బాస్. అయితే ఎవరు టాప్ 5కి అర్హత పొందరో ముగ్గురి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించడంతో పోటాపోటీగా ఈ ప్రక్రియ సాగింది. అఖిల్ బ్యాచ్‌కి ముందు నుండి గట్టిగా ఇస్తున్న శివ ఈ ప్రక్రియలో వారిని ధీటుగా ఎదుర్కొన్నాడు. నటరాజ్ మాస్టర్ పిచ్చి వాగుడుకి శివ సరైన సమాధానాలు ఇచ్చాడు.
నా పేరు యాంకర్ శివ.. మోస్ట్ ఎంటర్‌టైనర్ అంటూ చెప్పడంతో నటరాజ్ మాస్టర్ బిత్తర చూపులు చూశాడు. యాంకర్ శివ, మిత్ర శర్మ మధ్య వాదన తారాస్థాయికి చేరడంతో మిత్ర శర్మ ఐరన్ స్టాండ్ కి చేయి వేసి కొట్టుకుంది. దీంతో అఖిల్ పరిస్థితి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యాంకర్ శివ నటరాజ్ మాస్టర్, అఖిల్ లను నామినేట్ చేశాడు.

Anchor Shiva fire on akhil team
శివ.. అఖిల్ గురించి మాట్లాడుతున్న సమయంలో చాలా కంగారుపడుతున్నట్టు కనిపించాడు. శివ ధీటైన సమాధానాలకి అఖిల్ కూడా సరైన సమాధాలు ఇవ్వలేకపోయాడు. మొత్తానికి శివ పర్‌ఫార్మెన్స్ రోజురోజుకి ప్రేక్షకులకి తెగ నచ్చేస్తుండగా, మనోడిని టాప్ 3లో తప్పక చూస్తామని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బాబా భాస్కర్.. అనిల్, నటరాజ్ మాస్టర్, మిత్రాశర్మలను నామినేట్ చేశాడు. మిత్రశర్మ.. అరియానా, యాంకర్ శివ, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది. ఆలా ఈ వారం కెప్టెన్స్ కూడా ఎవరూ లేకపోవడంతో ఫైనల్ గా ఈ వారం హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాష్టార్మ్ అరియనా, అఖిల్ కాగా ఈ అందరూ ఇప్పుడు నామినేషన్స్ లోకి వెళ్ళిపోయారు. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది.