Sameera Sherief : పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన యాంకర్

Sameera Sherief : బుల్లితెర నటి, యాంకర్‌ సమీరా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుపరిచితం. ఆడ‌పిల్ల అనే సీరియ‌ల్‌తో అరంగేట్రం చేసి ఆ త‌ర్వాత అనేక సీరియ‌ల్స్‌లో న‌టించింది. కామెడీ షో అనిమేలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు, ఏదో ఒక నీడగా అనిపించింది. ఆ తర్వాత సమీరా కొన్నాళ్లుగా తెలుగు కాకుండా తమిళంలో సీరియల్స్‌తో బిజీగా ఉంది.

Anchor Sameera Sherief Blessed with Baby Boy
Anchor Sameera Sherief Blessed with Baby Boy

తాజాగా స‌మీరా పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని ఆమెఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 4న తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడని సమీరా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పంచుకుంది. తనకు తోడుగా నిలిచిన అభిమానులకు, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అన్వర్ అనే అబ్బాయిని వివాహం చేసుకున్న స‌మీరా గత నాలుగున్నరేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.

వీరి వివాహం పెద్దగా హడావుడి లేకుండా కుటుంబ, మత పెద్దల మధ్య జరిగింది. స‌మీరా అత్త ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళంలో కలిపి దాదాపు 600 సినిమాల్లో నటించారామె. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు