Biggboss5: మిడ్ నైట్ లో హగ్గులు.. రవి భార్య స్పందన ఏంటో తెలుసా?

Biggboss5: బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ విచిత్ర ప్రవర్తన అందరికి షాకింగ్ గా ఉంటుంది. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు. ఒకరిపై ఒకరు ఎన్నో నిందలు వేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రియ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి.

Anchor Ravi's Wife Response over Trolling against Him
Anchor Ravi’s Wife Response over Trolling against Him

లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి రవి, ఆమె హగ్‌ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్‌ విషయాలను వెల్లడించిది.ఆమె వ్యాఖ్యలపై లహరి, రవితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా ఓ రేంజ్‌లో మండిపడ్డారు. లహరి అయితే నేషనల్‌ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై సీరియస్‌ అయింది.

నా కూతురికి మీరు చేసిన వ్యాఖ్యలు అర్ధం అయితే ఎలా ఉంటుందని రవి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు సన్నీ. ఇలా బిగ్‌బాస్‌ హౌస్‌లోని ప్రతి ఒక్కరు ప్రియ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రవి భార్య సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది.
నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్ అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు రవి భార్య నిత్య.

తన భర్తకు అంత సపోర్టివ్ గా ఉన్న నిత్యపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ లాంటి భార్య ఉంటే అద్భుతాలు సాధించొచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.