Anchor Ravi : ర‌వి, ఆయ‌న కుటుంబంపై ట్రోల్స్.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న నిత్య‌

Anchor Ravi : తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ రవికి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.త‌న యాంక‌రింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. మనోడికి మంచి ఇమేజ్ ఉంది. దాన్నే ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగులో కూడా చూపిస్తున్నాడు. ప్రతీవారం నామినేట్ అవుతున్నా కూడా అంత బాగా రవి సేవ్ అవుతున్నాడంటే దానికి కారణం బయట ఈయనకు ఉన్న ఫాలోయింగ్. ఇప్పుడు కూడా యాంకర్ రవి తనదైన గేమ్ ప్లేతో ముందుకెళ్తున్నాడు.

Anchor Ravi wife Nitya emotional about trolls
Anchor Ravi wife Nitya emotional about trolls

బిగ్ బాస్ 5 సీజ‌న్‌లో ర‌వి స్ట్రాంగ్ క్యాండిడేటే. టైటిల్ విన్న‌ర్‌ల‌లో ఒక‌డిగా నిలిచే స‌త్తా… ర‌వికి ఉందని ఈ షోని ఫాలో అవుతున్న వాళ్లంతా న‌మ్ముతున్న మాట‌. ప్ర‌తీసారీ.. ఎలిమినేష‌న్ల‌లో ఉండ‌డం, ఓటింగ్ వ‌ల్ల‌.. గ‌ట్టెక్క‌డం ర‌వికి అల‌వాటుగా మారాయి. ర‌వి ఫాలోవ‌ర్లు… ర‌విని అభిమానించేవాళ్లు ర‌వికి అండ‌గా ఉంటున్నారు. అయితే..కొంత‌మంది ర‌విని అకార‌ణంగా కార్న‌ర్ చేయ‌డం మొద‌లెట్టారు.

Anchor Ravi wife Nitya emotional about trolls
Anchor Ravi wife Nitya emotional about trolls

నామినేషన్‌ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ర‌వి, ఇప్పటికే ఆయన హౌస్‌లో ఉన్నాడుఅంటే అత‌నికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ బిగ్ బాస్ హౌస్ లో గెలిచిన‌వాళ్లంతా సోష‌ల్ మీడియా స‌పోర్ట్ తో, కిరీటం తెచ్చుకున్నవాళ్లే. అయితే.. త‌మ‌కు హైప్ ఇచ్చుకోవ‌డం వేరు, ప‌నిగ‌ట్టుకుని వేరేవాళ్ల‌ని కించ‌ప‌ర‌చ‌డం వేరు.

ఓ వ‌ర్గం.. ర‌విని టార్గెట్ చేసి, ట్రోల్ చేయ‌డం మొద‌లెట్టింది. ర‌వితో ఆగితే ఫ‌ర్వాలేదు. కుటుంబ స‌భ్యుల్నికూడా ఈ ట్రోల్స్ లోకి తీసుకొస్తున్నారు. దాంతో ర‌వి భార్య నిత్య ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “నా పేరు, పిల్ల‌ల పేరు కూడా ఈ ట్రోల్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇది గేమ్ స్పిరిట్ కాదు“ అంటూ నిత్య త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.