Anchor Ravi: ‘తోట‌బావి’ అంటూ భయపెట్టేస్తున్నాడు.. యాంక‌ర్ ర‌వి హల్చల్

Anchor Ravi Thotabhavi Movie on 5th march
Anchor Ravi Thotabhavi Movie on 5th march

Anchor Ravi ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ తెర పై హీరోగా మారాలి, రాణించాలనే కలతోనే ఉంటారని, వస్తుంటారని అందరూ అంటుంటారు. అందుకు అవకాశాల కోసం అదును చూస్తూ వెయిట్ చేస్తుంటారు. ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడే ఉంటూ.. సరైన సమయంలో వెండితెర పై హీరోలుగా ఎదుగుతుంటారు. అలా యాంకర్ రవి కూడా తన లక్‌ను ఆ మధ్య పరీక్షించుకున్నాడు.

ఇది మా ప్రేమ కథ అంటూ ఓ సినిమాలో హీరోగా వచ్చాడు. కానీ అది అంతగా వర్కవుట్ కాలేదు. యాంకర్‌గా రవి పీక్స్‌లో ఉన్న సమయంలో హీరోగా ట్రై చేశాడు. కానీ అంతగా ఫలితం రాలేదు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు యాంకర్ రవి హీరోగా వస్తున్నాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

యాంక‌ర్ ర‌వి హల్చల్: Anchor Ravi

యాంకర్‌గా ఇప్పటికే రవి ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అలాంటి రవి మళ్లీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తోట‌బావి‘. అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. గౌత‌మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకం పై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు(విష్ణుప్రియహోట‌ల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినేష్. బి స‌హ‌నిర్మాత‌. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా టీజర్ కి విశేష స్పందన లభించింది. అంతకుముందు వచ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

‘తోట‌బావి’ అంటూ భయపెట్టేస్తున్నాడు..
ఈ సందర్భంగా దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ చేసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. హీరో ర‌వి గారి నటనను ప్రశంసించారు. ముందు నుంచి రవి ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని అన్నాడు.

Advertisement