Anchor Ravi: ట్రోల‌ర్స్ న‌న్ను ట్రోల్ చేయండి కాని ఆ ప‌ని చేయోద్దు: యాంక‌ర్ ర‌వి

NQ Staff - September 6, 2021 / 01:36 PM IST

Anchor Ravi: ట్రోల‌ర్స్ న‌న్ను  ట్రోల్ చేయండి కాని ఆ ప‌ని చేయోద్దు:  యాంక‌ర్ ర‌వి

Anchor Ravi: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5న ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరి, సన్నీలు మొదటి, రెండో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చేశారు. మూడో కంటెస్టెంట్‌గా నటి లహరి, నాల్గో ఇంటి సభ్యుడిగా సింగర్ శ్రీరామ చంద్ర , ఐదో కంటెస్టెంట్‌గా మాస్ స్టెప్పులతో యానీ మాస్టర్ , ఇక ఆరో కంటెస్టెంట్‌గా రోబో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏడో కంటెస్టెంట్‌గా ప్రియ ఎంట్రీ ఇచ్చారు.

Anchor Ravi Serious Comments On Haters

Anchor Ravi Serious Comments On Haters

ఎనిమిదో కంటెస్టెంట్‌గా సూపర్ మోడల్ జెస్సీ (జశ్వంత్) ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదో వ్యక్తిగా ప్రియాంక సింగ్ , పదో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జశ్వంత్ , 11వ వ్యక్తిగా హీరోయిన్ హమీద , 12వ వ్యక్తిగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదమూడో కంటెస్టెంటుగా బోల్డ్ బ్యూటీ సరయు ,. పద్నాలుగో కంటెస్టెంట్‌గా విశ్వ , పదిహేనో కంటెస్టెంటుగా కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవీ , పదహారో కంటెస్టెంట్‌గా కోయిలమ్మ ఫేమ్ మానస్ , పదిహేడో కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్, 18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ, 19వ కంటెస్టెంట్‌గా యాంక‌ర్ ర‌వి వచ్చాడు.
more ad

more ad

more ad

more ad
బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తూ ఉండే ర‌వి ఇలా బిగ్ బాస్ హౌజ్‌కి రావ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.అయితే తాను బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్లే ముందు క్వారంటైన్‌లోఉండ‌గా, ఆ స‌మ‌యంలో ఓ వీడియో రికార్డ్ చేసి విడుద‌ల చేశారు. అందులో తప్పు చేస్తే ట్రోల్ చేయండి.. కానీ అందులోకి ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకురాకండని వేడుకున్నారు. ‘పోతోన్నా.. పోతోన్నా.. బిగ్ బాస్ ఐదో సీజన్‌కు వెళ్తున్నా.. యాంకర్ రవి ఇక్కడ.. ఎంట్రీ కూడా చూసేసి ఉంటారు.
more ad

more ad

more ad

more ad
పీకల వరకు ఉండే లాస్ట్ మంత్ వరకు. ఎంతో మంది నన్ను అడిగారు. సోషల్ మీడియాలో అందరూ కూడా బిగ్ బాస్ షోకు వెళ్తున్నావా? అని అడిగారు. కానీ రూల్స్ వల్ల ఎవ్వరికీ చెప్పలేదు. అందరికీ సారి. బిగ్ బాస్ అనేది అద్భుతైన షో. నాకు ఎంతో ఇష్టం. ఇందులో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. దేవుడికి, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మీ అందరి వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. అన్ని సీజన్లకు అవకాశం వచ్చింది. కానీ ఈ సీజన్‌లో రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
more ad

more ad

more ad

more ad
గత నాలుగు సీజన్లు రావడానికి నాకు వేరే కమిట్మెంట్స్ ఉండే.. కానీ ఈ సీజన్‌కు రావాలని అనిపించింది. అందుకే అడుగుపెడుతున్నాను. ఎందుకు ఈ సీజన్‌లోనే వచ్చావ్ అని అడుగుతారేమో. ఇది చాలాపెద్ద షో. దీని ద్వారా ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయొచ్చు. పదకొండేళ్ల నుంచి టీవీ ఇండస్ట్రీలో కంటిన్యూగా పని చేస్తూనే వచ్చాను. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి.. డిప్రెషన్‌లోకి వెళ్లిన రోజులున్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల బయటకు వచ్చాను. ఎవరెవరు అయితే యాంకర్ రవి ఇలాంటోడు అని వేలెత్తి చూపించారో వాళ్లకు సమాధానం చెప్పడానికి వచ్చాను. ఇంత వరకు యాంకర్ రవిని చూశారు. కానీ రవి కిరణ్ రాట్లేను చూపిస్తారు. అదే నా ఒరిజినల్ పేరు అని చెప్పుకొచ్చాడు.
more ad

more ad

more ad

more ad
మీరు నాకు సపోర్ట్ చేయండి.. లోపల ఎలా ఉంటుందో తెలియదు.. కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం.. కానీ నా వైపు నుంచి నేను నిజాయితీగా ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశ్యం మాత్రం గట్టిగా ఉంది. కానీ లోపల ఏమైనా తప్పుగా మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించండి. ట్రోలర్స్, ట్రోలింగ్ చేయండి.. అది మీ క్రియేటివిటీ.. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. కానీ నేను ఏదైనా తప్పు చేస్తే.. మా ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇన్వాల్వ్ చేయకండి.. అది చాలా సెన్సిటివ్.. నన్ను ట్రోల్ చేయండి కావాలంటే. బిగ్ బాస్ షోకు వెళ్లాను కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి.. నిత్య, వియాను జాగ్రత్త చూసుకోండి.. చాలా మాట్లాడాలని ఉంది.. కానీ నర్వెస్, ఎగ్జైటింగ్‌గా ఉంది’ అంటూ రవి మ‌న‌సులో ఉన్న‌దంతా వెళ్ల‌గ‌క్కారు.


more ad

more ad

more ad

more ad

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us