Anchor Ravi: పెళ్లి టాపిక్ వ‌ద్ద‌ని నాగార్జునని వేడుకున్న యాంక‌ర్ ర‌వి

Anchor Ravi: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించే బిగ్ బాస్ షో ఇప్ప‌టికే మొద‌లైంది.ఆదివారం జ‌రిగిన ఈ షోకి 19 మంది కంటెస్టెంట్స్ హాజ‌ర‌య్యారు. చివ‌రి కంటెస్టెంట్‌గా యాంక‌ర్ ర‌వి హాజ‌రు కాగా, ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టాడు.

Anchor Ravi Requested Nagarjuna Not to discuss about his Marriage Topic
Anchor Ravi Requested Nagarjuna Not to discuss about his Marriage Topic

యాంక‌ర్ ర‌విని రావ‌డం రావ‌డంతోనే ఇరికించేశాడు నాగార్జున‌. నీకు పెళ్లైంది అట కదా, ఈ విష‌యం చెప్ప‌నే లేదు అని నాగ్ అన‌గా, అందుకు ర‌వి.. సర్ ఆ విషయం మూడేళ్ల క్రితమే అందరికీ చెప్పేశాను అని రవి అన్నారు. కానీ నాకు చెప్పలేదు కదా? అని నాగ్ అనేశారు. మీకు తెలుసు కదా? సర్ అని రవి తప్పించుకునే ప్రయత్నం చేశారు.


నేను నిజం చెప్పినా కూడా కొంత మంది న‌మ్మ‌డం లేదు. వారికి నిజమైన రవిని చూపించాలే బిగ్ బాస్ షోలోకి వచ్చాను అని అన్నారు. ఇంత వరకు అందరూ యాంకర్ రవిని చూశారు.. కానీ అసలు రవి కిరణ్ గురించి ఇప్పుడు అందరూ తెలుసుకుంటారు అని చెప్పుకొచ్చారు.


అయితే తొలి రోజు హౌజ్‌లోకి వెళ్లిన రవి తోటి కంటెస్టెంట్స్‌తో బాగానే సంద‌డి చేశాడు. త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తూ, డ్యాన్స్ చేస్తూ అల‌రించాడు. రవి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రానున్న రోజుల‌లో మ‌రింతగా ఉంటుంద‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరి, సన్నీలు మొదటి, రెండో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చేశారు. మూడో కంటెస్టెంట్‌గా నటి లహరి వచ్చారు. నాల్గో ఇంటి సభ్యుడిగా సింగర్ శ్రీరామ చంద్ర అద్భుతమైన పాటలు పాడుతూ వచ్చారు. ఐదో కంటెస్టెంట్‌గా మాస్ స్టెప్పులతో యానీ మాస్టర్ అద్బుతమైన ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆరో కంటెస్టెంట్‌గా రోబో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏడో కంటెస్టెంట్‌గా ప్రియ ఎంట్రీ ఇచ్చారు.


ఎనిమిదో కంటెస్టెంట్‌గా సూపర్ మోడల్ జెస్సీ (జశ్వంత్) ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదో వ్యక్తిగా ప్రియాంక సింగ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇచ్చారు. 11వ వ్యక్తిగా హీరోయిన్ హమీద ఎంట్రీ ఇచ్చారు. 12వ వ్యక్తిగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదమూడో కంటెస్టెంటుగా బోల్డ్ బ్యూటీ సరయు వచ్చారు. పద్నాలుగో కంటెస్టెంట్‌గా విశ్వ వచ్చారు.


ఇక పదిహేనో కంటెస్టెంటుగా కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవీ ఎంట్రీ ఇచ్చారు. పదహారో కంటెస్టెంట్‌గా కోయిలమ్మ ఫేమ్ మానస్ వచ్చారు. పదిహేడో కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్, 18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మలు వచ్చారు.