Anchor Ravi: కొత్త వ్యాపారంలోకి యాంకర్ రవి.. ప్లానింగ్ మామూలుగా లేదు!

Anchor Ravi New beginning And Starts Business
Anchor Ravi New beginning And Starts Business

Anchor Ravi యాంకర్ రవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. పలు షోలతో యాంకర్ రవి తనదైన శైలిలో రాణిస్తున్నాడు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో రెండు వైపులా రచ్చ చేస్తున్నాడు.బుల్లితెరపై తనకు అలవాటైన శైలిలో రఫ్ఫాడిస్తున్నాడు. ఇక యూట్యూబ్‌లోనూ రవి స్పెషల్ ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా రవి కొత్త అడుగు వేయబోతోన్నట్టు కనిపిస్తోంది.

యాంకర్ రవి అన్ని రంగాల్లోకి అడుగుపెట్టేశారు. బుల్లితెర పై స్టార్ స్టేటస్ దక్కించుకున్న రవి.. వెండితెర పై హీరోగా మారాడు. శశిరేఖ పరిణయం సీరియల్ హీరోయిన్ మేఘనా లోకేష్‌తో కలిసి ఓ సినిమా చేశాడు. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే మళ్లీ అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. బుద్దిగా బుల్లితెర పైనే వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ బిజిబిజీగా గడిపేస్తున్నాడు.

లాక్డౌన్‌లో యాంకర్ రవి తన యూట్యూబ్‌ చానెల్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. భార్యాపిల్లలతో కలిసి స్పెషల్ వీడియోలను చేస్తూ యూట్యూబ్ చానెల్‌ను బాగానే పైకి లేపుతున్నాడు. మొత్తానికి యాంకర్ రవి మాత్రం నిత్య, వియాలతో చేసే అల్లరిని అందరూ ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి చేసిన వీడియోలు బాగానే క్లిక్ అవుతున్నాయి.

కొత్త వ్యాపారంలోకి యాంకర్ రవి.. Anchor Ravi

రవి ప్రస్తుతం బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా రవి ఓ పోస్ట్ చేశాడు. అందులో ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. కొత్త ఆరంభం.. త్వరలోనే అన్నీ ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు. కొబ్బరి కాయ కొట్టి మరీ పూజలు చేశాడు. అయితే ఇందులో సరిగ్గా గమనిస్తే.. ఏదో రెస్టారెంట్ పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా పద్దతిగాప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఇలా రెస్టారెంట్‌లు పెట్టి బిజినెస్ చేయడం సెలెబ్రిటీలకు కామన్ అన్న సంగతి తెలిసిందే.

Advertisement