Manjusha: రాఖీ సినిమాకు ఇప్ప‌టికీ మంజూష ఎంత‌లా మారింది..!

Manjusha: యాంక‌ర్ మంజూష తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఎన్టీఆర్ న‌టించిన ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన మంజూష తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈ సినిమాలో మంజూష న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పటికీ మంజూష అంటే అంద‌రికి రాఖీ సినిమాలోని మంజూష‌ ఫేస్ ఎక్కువ‌గా గుర్తొస్తుంది.

manjusha

రాఖీ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష.

ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన మంజూష ఇప్పుడు గేర్ మార్చింది. అందాల ఆర‌బోత‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా సినిమాల‌కు సంబంధించిన ఇంట‌ర్వ్యూలు చేస్తూ బాగానే సంపాదించింది. మంజూష కూడా ఈవెంట్స్ కు 50వేలకు పైగా అందుకుంటున్నట్లు టాక్.

తెలుగులో అనసూయ, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ ఇలాంటి హాట్ యాంక‌ర్స్ అందరూ ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల లిస్టులో మంజూష కూడా చేరింది. గ్లామర్ డోస్ పెంచి అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి..

ఈమె పిక్స్‌కి నెటిజన్ల నుండి మామూలు రెస్పాన్స్ రావట్లేదు.. ఈ పిక్స్ చూసి దర్శక నిర్మాతలు మంజూషకి హీరోయిన్ ఆఫర్స్ ఇచ్చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మ‌డు తాజాగా డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేయ‌గా, ఇందులోను హాట్‌గా క‌నిపించింది. అయితే మంజూష అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తూ ఎంతగా మారిపోయింద‌ని కామెంట్స్ పెడుతున్నారు నెటిజ‌న్స్.