ANCHOR JHANSI: త‌న టీంని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్న యాంక‌ర్ ఝాన్సీ

కరోనా విల‌య తాండవం చేస్తున్న వేళ టీవీ, సినీ ఆర్టిస్ట్స్ ముందుకు వ‌చ్చి త‌మ వంతు సాయం చేస్తున్నారు. యాంక‌ర్ ఝాన్సీ కూడా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి త‌న వంతు సాయం చేస్తుంది. అయితే ఝాన్సీ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆమె టీం ద‌గ్గ‌ర ఉండి చూసుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని తన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ ఉద్వేగానికి లోనైంది ఝాన్సీ.

నా ద‌గ్గ‌ర పని చేస్తున్న స్టాఫ్‌ని చూసి గ‌ర్వంగా ఉంది. నా టచప్‌ అసిస్టెంట్‌ రమణ లాక్‌డౌన్‌లో నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. నాకు వీలైనంతలో ఒక 25 మందికి నెలకు సరిపడా సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అయితే దాన్ని నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినప్పటికీ, ప్రస్తుతం తనకు ఇబ్బంది లేదంటూ అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసరాలు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు. మా శ్రీను , రమణ , జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు .. వీరితో కలిసి పని చేయడం నా అదృష్టం. దేవుడు వారిని చ‌ల్ల‌గా చూడాల‌ని కోరుకుంటున్నాను అని ఝాన్సీ త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.