Puri Jagnnath: పూరీ జ‌గ‌న్నాథ్ పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిన యాంక‌ర్.. ఆమె ఎవ‌రో తెలుసా?

Puri Jagannath: కథ, కథనం, టైటిల్స్‌లో కొత్త‌ద‌నం చూపిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు పూరీ జ‌గ‌న్నాథ్‌. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రాలను అతి తక్కువ సమయంలో తెరకెక్కించి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్టందుకోవడమే పూరీ స్టైల్. కమర్షియల్ సినిమాకి త‌న‌దైన మార్క్‌, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనదైన డైలాగ్‌లతో మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేయగలడు.

Anchor Jhansi Help to Puri Jagannath Marriage
Anchor Jhansi Help to Puri Jagannath Marriage

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ బద్రి’ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తిరుగులేని విజయాలను అందుకోవడమే కాదు రవితేజను కెరీర్ స్పీడ్ పెంచాయి కూడా. సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన ‘పోకిరి’ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

ఆ తర్వాత ‘చిరుత,’ ‘దేశముదురు’ తో పూరీ మంచి సక్సెస్ అందుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురై పూరీ కెరీర్ కాస్త నెమ్మదించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’, ‘బిజినెస్ మేన్’, ‘ఇద్దరమ్మాయిలతో’ ,’ టెంపర్’, ‘ఇజం’.. ఇలా యంగ్ హీరోలందరితోనూ వరుస మూవీస్ తెరకెక్కించాడు పూరీ. మధ్యలో కొన్ని పరాజయాలతో పూరి కెరీర్ కాస్త నెమ్మదించనా మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో దూసుకొచ్చాడు. ప్ర‌స్తుతం లైగ‌ర్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం పూరీ పెళ్లికి సంబంధించిన విష‌యం ఒక‌టి వైర‌ల్‌గా మారింది. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరీ. అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులు మాత్రం అప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు పూరీ. తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈయన. యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్.